Blast In Nagpur : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు..ఇద్దరు మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నాగపూర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది.  

New Update
Blast A In Nagpur

Blast A In Nagpur

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నాగపూర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ మధ్యాహ్నం పేలుడు సంభవించింది.  


పేలుడు పదార్థాలను తయారు చేసే ఈ కంపెనీలో పేలుడు సంభవించడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనతో సమీపంలోని పొదలకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులతో పాటు గాయపడిన వారిని సమీప దవాఖానలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు