/rtv/media/media_files/2026/05/12/big-shock-for-vijay-2026-05-12-11-25-04.jpg)
Big shock for Vijay
BIG BREAKING: తమిళనాడు అసెంబ్లీలో త్వరలో జరగబోయే కీలకమైన విశ్వాస (బల) పరీక్షకు ముందే అధికార పక్షమైన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఒక ఓటు వివాదంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. టీవీకే (TVK) ఎమ్మెల్యే ఆర్. శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా, ఓటు వేయకుండా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం నిషేధం విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
The Madras High Court has barred TVK MLA Srinivasa Sethupathi, who won from the Tiruppattur constituency in Sivaganga district, from voting in the Assembly.
— Bala vetrivel N (@vetrivel1996) May 12, 2026
The court’s order comes after he defeated former minister Periya Karuppan by a margin of just one vote.
With a crucial… pic.twitter.com/xAnGzC49Ld
ఒకే ఒక్క ఓటు.. కోర్టు మెట్లెక్కిన వివాదం
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గం ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ స్థానంలో 'దళపతి' విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థి ఆర్. శ్రీనివాస సేతుపతికి 83,365 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, డీఎంకే (DMK) సీనియర్ నేత, మాజీ మంత్రి కె.ఆర్. పెరియకరుప్పన్‌కు 83,364 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం ఒక్క ఓటు స్వల్ప తేడాతో టీవీకే అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తీవ్ర అక్రమాలు జరిగాయని, తమ నియోజకవర్గానికి చెందాల్సిన ఒక కీలకమైన పోస్టల్ బ్యాలెట్‌ను పొరపాటున మరో జిల్లాలోని తిరుపత్తూరుకు పంపించి, అక్కడ రిటర్నింగ్ అధికారి దానిని తిరస్కరించారని డీఎంకే నేత పెరియకరుప్పన్ ఆరోపించారు. ఒకవేళ ఆ ఓటును సక్రమంగా లెక్కించి ఉంటే ఫలితం మారిపోయేదని పేర్కొంటూ ఆయన మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఓట్లను తిరిగి లెక్కించాలని (రీకౌంటింగ్), అప్పటివరకు సేతుపతి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని కోరారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి, జస్టిస్ ఎన్. సెంథిల్ కుమార్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు వెకేషన్ (ప్రత్యేక) బెంచ్ ఆదివారం, సోమవారం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున కోర్టు జోక్యం చేసుకోకూడదని ప్రతివాదులు వాదించినప్పటికీ.. ఒక్క ఓటు తేడాతోనే అభ్యర్థి విజయం ఖరారైనందున, ఓటరు హక్కును కాపాడటం ముఖ్యం అని ధర్మాసనం అభిప్రాయపడింది. విశ్వాస పరీక్ష ముంచుకొస్తున్న తరుణంలో, ఈ వివాదం తేలేవరకు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో ఎలాంటి ఓటు వేయడానికి వీల్లేదని కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు విధించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని (ECI) ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
మరో రెండు వారాల్లో 717 వైన్ షాపుల మూసివేత వంటి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం విజయ్ ప్రభుత్వానికి ఈ కోర్టు తీర్పు కొంత ఆందోళన కలిగించే అంశమే. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో సొంత పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్ హక్కును కోల్పోవడం.. అది కూడా కేవలం ఒక్క ఓటు మార్జిన్‌తో గెలిచిన సీటు వివాదంలో పడటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠకు తెరలేపింది.
Follow Us