/rtv/media/media_files/2026/05/12/tvk-2026-05-12-15-26-57.jpg)
TVK Issues Strict Warning to Cadres Against Banners and Public Inconvenience
తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఎలాంటి అసౌఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు.. సొంత క్యాడర్‌కు 'టీవీకే' స్ట్రాంగ్ వార్నింగ్కర్యం కలగకుండా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని తమ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టినరోజు వేడుకలు లేదా కుటుంబ శుభకార్యాలు వంటి ఏ సందర్భంలోనైనా.. పబ్లిక్ స్థలాల్లో, రద్దీగా ఉండే వీధుల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజల రాకపోకలకు, సాధారణ ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించేలా ప్రదర్శనలు చేయడం, సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని స్పష్టం చేసింది.
தலைமை நிலையச் செயலக அறிவிப்பு
— TVK Party HQ (@TVKPartyHQ) May 12, 2026
கழகத் தோழர்கள் அனைவருக்கும் வணக்கம்.
தமிழ்நாட்டு மக்களின் நலன் ஒன்றையே குறிக்கோளாகக் கொண்டு தொடங்கப்பட்டதுதான் தமிழக வெற்றிக் கழகம். தமிழ்நாட்டு மக்களின் ஏகோபித்த நம்பிக்கையைப் பெற்ற, தமிழ்ச் சொந்தங்களின் குடும்பத்தில் ஒருவராக இருக்கக்கூடிய…
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. NEET (UG)-2026 పరీక్ష రద్దు
ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీవీకే హెచ్చరించింది. క్రమశిక్షణ తప్పి అతిగా ప్రవర్తించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపింది. కేవలం రాజకీయ అధికారం కోసమే కాక.. ప్రజల శ్రేయస్సు కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పింది. దీన్ని నిరూపించేలా పార్టీలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పిలుపునిచ్చింది.
Follow Us