/rtv/media/media_files/2026/06/18/modi-trump-2026-06-18-07-44-26.jpg)
Modi-trump
ఫ్రాన్స్‌లోని ఇవియాన్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ జరిగింది. దాదాపు 16 నెలల తర్వాత ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్లు నేరుగా కలుసుకుని రక్షణ, వాణిజ్యంపై కీలక చర్చలు జరిపారు. భారత్-అమెరికా బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేలా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ భద్రత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు.
ఇది కూడా చూడండి: Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!
ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు భారీ భరోసా ఇచ్చారు. భారత్‌పై ఎవరైనా దాడికి దిగితే మేము ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని, రక్షణగా నిలుస్తామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. భారత్‌తో అమెరికాకు ఎలాంటి అధికారిక రక్షణ కంట్రాక్ట్ లేకపోయినప్పటికీ.. మోదీ నాయకత్వంలోని భారత్‌కు తాము ఎల్లప్పుడూ ప్రాణస్నేహితుడిలా ఉంటామని స్పష్టం చేశారు. "నేను వైట్ హౌస్‌లో ఉన్నంత కాలం భారత్‌కు ఒక గొప్ప స్నేహితుడు అక్కడ ఉన్నట్లే" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రక్షణ పరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా మోదీ అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని ట్రంప్ కొనియాడారు.
ఇది కూడా చూడండి: Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : 'ఇండో' పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..
‘మోదీ చాలా టఫ్ నెగోషియేటర్’
ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని, ఆయన బేరసారాలు ఆడే శైలిని ట్రంప్ తనదైన శైలిలో ఆకాశానికెత్తారు. మోదీ చూడటానికి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారని, కానీ దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం ఒక ‘కిల్లర్’ లాంటి గట్టి పట్టుదల గల వ్యూహకర్త అని ట్రంప్ అభివర్ణించారు. "నేను చూసిన వారిలో మోదీ అత్యంత కఠినమైన నెగోషియేటర్ అని అన్నారు. ఆయన భారత ప్రజలను ఎంతో ప్రేమిస్తారు. అందుకే వ్యాపార ఒప్పందాల్లో అస్సలు తగ్గరు" అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చూడండి: Meenakshi Natarajan Case : రిటర్నింగ్ అధికారి vs ప్రజాస్వామ్యం
🚨 LMFAO!! President Trump just dropped this hilarious line right in front of Indian PM Modi
— Eric Daugherty (@EricLDaugh) June 17, 2026
"So you look at this man. I'll give you a lesson. He's the most BEAUTIFUL-looking man. He looks so nice. He's like an angel!" 😭
"But actually, he's tough, he's a killer. He's as tough… pic.twitter.com/0WG3isqcyJ
ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశులేవంటే?
Follow Us