/rtv/media/media_files/2024/12/31/PpJMfI6GynWynZFFk1Oe.jpg)
amith sha Photograph: (amith sha)
దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్రమంత్రి అమిత్‌షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. అభివృద్ధి లేకపోవడం వల్లే నక్సలిజం పుట్టిందనడంలో వాస్తవం లేదన్నారు.అలా అంటే 70 ఏళ్ల స్వాతంత్రంలో 60 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలో ఉందని, మరి అభివృద్ధి ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బస్తర్‌లో దాదాపు నక్సలిజం అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మార్చి 31తో మావోయిస్టులకు ఇచ్చిన గడువు ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలో అనేకమంది మావోయిస్టు నేతలు లొంగిపోయారన్నారు. మిగిలినవారంతా ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాల్సిందేనని చెప్పారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు. మావోయిస్టుల ఏరివేతకు రేపటితో డెడ్ లైన్ ముగుస్తోందని.బస్తర్‌లో ప్రస్తుతం మావోలు లేరని ఆయన తేల్చి చెప్పారు. బస్తర్‌లోని ఆదివాసీలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.
కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదని విమర్శించారు. ఆ పార్టీ పరిపాలన మూలంగానే నక్సలిజం పెరిగిందని ఆరోపించారు. ఎన్డీయే వచ్చాకే గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయని వివరించారు. కాంగ్రెస్ పాలన కాలంలో విలీన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని.. కాంగ్రెస్ పాలనలోనే గిరిజన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని అమిత్ షా ప్రశ్నించారు. వారి పాలనలో బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.. కాంగ్రెస్ నిర్వాకం వల్లే దేశంలో మావోయిజం పెరిగిందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. మావోయిజం వల్ల 12 రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందని అమిత్ షా ఆరోపించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తమ వల్లే నక్సల్స్ విముక్త భారత్ సాధ్యమవుతోందని లోక్ సభ వేదికగా అమిత్ షా ప్రకటించారు.
Follow Us