Tips To Save Cooking Gas : యుద్ధకాలం..గ్యాస్ కొరత..ఇలా చేస్తే  మీ వంట గ్యాస్‌ బోలెడంత ఆదా..!

దేశ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితి ఇలాగే కొనసాగితే వంటింటి గ్యాస్‌కు కూడా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో గ్యాస్ ను పొదుపు చేసుకోవలసిన అవసరం ఎంతైన ఉందని నిపుణులు చెబుతున్నారు.

New Update
FotoJet (46)

 Tips To Save Cooking Gas

Tips To Save Cooking Gas: ఇది ప్రపంచానికి సంక్షోభకాలం..ఇరాన్, ఇజ్రాయెల్‌,అమెరికా మధ్య నెలకొన్న యుద్ధం మూలంగా గల్ఫ్ దేశాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలనుంచి ప్రపంచదేశాలకు అందాల్సిన చమురు, గ్యాస్ అందడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేయడం తో ఇంధన రవాణా నౌకలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో గ్యాస్ నిలువులు నిండుకున్నాయి. దీంతో చాలా దేశాల్లో గ్యాస్‌ పంపిణీ నిలిచిపోయింది. ముఖ్యంగా కమర్షియల్‌ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. మనదేశంలోనూ పలు నగరాల్లో కమర్షియల్‌ గ్యాస్ సరఫరాను ఆయా పంపిణీ సంస్థలు నిలపివేశాయి. దీంతో పలు హోటల్స్‌, హాస్టల్స్‌ మూసివేతకు గురయ్యాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితి ఇలాగే కొనసాగితే వంటింటి గ్యాస్‌కు కూడా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో గ్యాస్ ను పొదుపు చేసుకోవలసిన అవసరం ఎంతైన ఉందని నిపుణులు చెబుతున్నారు.

2

దేశ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. దీంతో చాలా మంది వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు ముందుగానే బుక్ చేసుకుని ఇంట్లో నిల్వ చేసుకుంటారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా కీలక నిర్ణయం తీసుకన్నాయి. గ్యాస్ బుకింగ్‌ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్యాస్‌ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్యాస్‌ ను పొదుపుగా వాడుకోవడం అవసరం. దీనికోసం చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే వంటగదిలో గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్మార్ట్ హ్యాక్‌లను పాటిస్తే ఒక గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని సుమారు 15 నుంచి 20 రోజుల వరకు కూడా పెంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చు. సరళమైన కిచెన్ చిట్కాలను పాటిస్తూ గ్యాస్ వృథాను అరికట్టవచ్చు, నెలవారీ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోండి.  

ఇలా చేయండి 
 వంట చేసేటప్పుడు సాధారణంగా స్టవ్‌ వెలిగించకుండా ముందుగా వంటకు కావలసిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాతే గ్యాస్ స్టౌవ్‌ను వెలిగించుకోవాలి. వంట పాత్రపై మూత సరిగ్గా పెట్టాలి. దీనివల్ల వేడి సరిగ్గా అందుతుంది. ఆహారం త్వరగా ఉడుకుతుంది. బర్నర్‌కు సరిపోయే పాత్రను ఎంచుకోవాలి. చిన్న బర్నర్‌పై పెద్ద పాత్ర పెట్టడం వల్ల గ్యాస్‌ వృధా అవుతుంది.

4

బీన్స్, పప్పులు, బియ్యం వంటివాటిని వండే ముందు కొంత సమయం ముందే వాటిని నీటిలో నానబెట్టడం మంచిది. దానివల్ల త్వరగా ఉడికే అవకాశం ఉంటుంది. అలాగే, కాయగూరలను ఉడకబెట్టేందుకు తగినంత నీరు మాత్రమే వాడాలి. అలాకాకుండా ఎక్కువ నీరు పోసి వండితే.. అందులో వున్న పోషకాలు వృథా అవడమే కాకుండా గ్యాస్, సమయం కూడా వేస్ట్‌ అవుతుంది. ఫలితంగా వంట రుచి కూడా పాడవుతుంది. ఆహార పదార్థాలను ఎప్పుడూ చిన్న మంటపై ఉడికించాలి. దానివల్ల గ్యాస్ వృథా కాదు. ఆహారం బాగా ఉడుకుతుంది.

FotoJet (47)

వంట చేసేటప్పుడు ఎక్కువ మంది పట్టించుకోని ఒక ముఖ్యమైన విషయం గ్యాస్ బర్నర్, కుండ మధ్య దూరం. కుండ మంట నుంచి చాలా ఎత్తులో ఉంటే మంట నుంచి వచ్చే వేడి నేరుగా పాత్రకు తగలదు. దీంతో ఆహారం వేడెక్కేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి కుండను బర్నర్‌కు సరైన దూరంలో ఉంచడం చాలా ముఖ్యం. మంట నుంచి వచ్చే వేడి నేరుగా పాత్రను తాకితే ఆహారం త్వరగా ఉడుకుతుంది.గ్యాస్ కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
 
 వంటగదిలో గ్యాస్ ఆదా చేయడానికి మరో అత్యంత సమర్థమైన అలవాటు ప్రెజర్ కుక్కర్. ముఖ్యంగా పప్పులు, బియ్యం, కూరగాయలు లేదా మాంసం వంటి గట్టిగా ఉండే ఆహార పదార్థాలను కుక్కర్‌లో వండితే చాలా త్వరగా ఉడుకుతాయి. కుక్కర్‌లో ఏర్పడే అధిక ఆవిరి ఒత్తిడి వల్ల ఆహారం తక్కువ సమయంలోనే ఉడికే అవకాశం ఉంటుంది. అయితే కుక్కర్‌లో సరైన పరిమాణంలో నీరు ఉండేలా చూసుకోవడం అవసరం.  దాని మూత బాగా గట్టిగా ఉండటం చాలా అవసరం. గ్యాస్కెట్ సరిగా ఉండి ఆవిరి బయటకు పోకుండా ఉంటే గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గించవచ్చు.

Advertisment
తాజా కథనాలు