/rtv/media/media_files/2025/04/07/g3kmObUKPrGpzJvUyr23.jpg)
Karnataka
Karnataka : ఇద్దరు మైనర్ బాలలను చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన.. కర్నాటకలోని దావణగెరి కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. నల్లూరు సమీపంలోని అస్తపనహళ్లిలో ఈ సంఘటన జరిగింది. హకీపిక్కీ వర్గానికి చెందిన బాలలపై.. అదే వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. వీరంతా మూలికలు అమ్ముతూ జీవనోపాధి పొందుతుంటారు. అయితే దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు బాలలను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆపై ఎర్ర చీమలను వారి ప్రైవేటు పార్ట్స్ లో వదిలారు.నొప్పి తాళలేక వాళ్లు కేకలు పెడుతుంటే.. అవి వింటూ నిందితులు డ్యాన్స్‌లు చేశారు. ఆనందంతో విర్రవీగుతూ వారిపై కర్కశంగా దాడి చేస్తూ.. పైశాచికానందం పొందారు.
Also Read : Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!
ఒక బాలుడు దర్శన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. ఈ దొంగతనం చేయటంలో మరో బాలుడు సాయం చేశాడు. సాయంత్రానికి దొంగతనం చేసిన బాలుడు దొరికేశాడు. ఆ తర్వాత సాయం చేసిన బాలుడు కూడా దొరికాడు. నిందితులు ఇద్దర్నీ కూడా అక్కడి అడవుల్లోకి తీసుకెళ్లారు. చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. వారి చడ్డీలలోకి ఎర్ర చీమల్ని వదిలి హింసించారు. దాన్నంతా వీడియో తీశారు. బాగా చిత్ర హింసలు పెట్టిన తర్వాత వదిలేశారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దెబ్బలు తిన్న ఓ బాలుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలలను తీవ్రంగా హింసించిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఘటనను తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!
మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చన్నగిరి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవీష్ తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బాధితులలో ఒకరి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుభాష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లక్కీ, దర్శన్, పరసు, శివదర్శన్, హరీష్, పట్టి రాజు, భూని, సుధాన్‌ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. బాధితుడితో పాటు నిందితులు కూడా హక్కిపిక్కి జాతికి చెందిన వారే. వారంతా అడవిలోని మూలికలు అమ్మి జీవిస్తుంటారు. అరెస్టు చేసిన వారందరినీ ఆదివారం జె.ఎం.ఎఫ్.సి కోర్టు ముందు హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని రవీష్ అన్నారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీగా అద్దంకి ప్రమాణ స్వీకారం.. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న కోమటిరెడ్డి.. ఫొటోలు వైరల్