/rtv/media/media_files/2025/02/24/0kxeZEzFPJDr063pLpuB.webp)
CM Mamata Banerjee
CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి దగ్గర గుర్తుతెలియని బాక్స్ కలకలం రేపింది. మమతా బెనర్జీ ఇంటికి 500 మీటర్ల దూరంలో ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్లో బాంబులు ఉన్నాయేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Also read : Delhi: సీఎం రేఖా గుప్తా జీతం, అరవింద్ కేజ్రీవాల్ పెన్షన్ ఎంతో తెలుసా ?
అంతేకాదు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి బాక్సే కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. బాంబు స్క్వాడ్ ఈ రెండు స్పాట్స్కు చేరుకుని పరిశీలించారు. అయితే.. ఆ రెండు బాక్సుల్లో మెడిసిన్స్ కనిపించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇలా ఎవరికీ తెలియకుండా బాక్సులు పెట్టిన ఘటన మాత్రం షాక్కు గురిచేసింది.
Also Read : పాకిస్థాన్లో హై అలెర్ట్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రంగంలోకి ఉగ్రవాదులు!
పైగా.. కోల్కత్తా నగరంలోనే సేఫెస్ట్ ప్లేస్గా మమతా ఉండే ఏరియాకు పేరుంది. అలాంటి ప్రాంతంలో రెండు బాక్సులు ఎవరి కంటా పడకుండా, పోలీసుల కళ్లుగప్పి అక్కడ అనుమానస్పదంగా పెట్టడంతో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఈ ప్రాంతంలో స్థానికంగా ఉంటున్న ఒకరు ఆ బాక్సులను గమనించారు. ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో ఆ బాక్సుల్లో మాములు మెడిసిన్స్ మాత్రమే ఉన్నట్లు తేల్చారు. ఇదిలా ఉండగా.. 2026లో వెస్ట్ బెంగాల్ లో జరగబోయే ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని అభిషేక్ బెనర్జీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: SLBC tunnel: 40ఏళ్ల నాటి ఆలోచన ఇంకా ఆచరణలోకి రాలే.. SLBC ప్రాజెక్ట్ హిస్టరీ ఇదే..!!