Maoist movement : నక్సల్బరీలో ఎగిసి...తెలంగాణలో ముగిసి

దశాబ్దాల పాటు సెంట్రల్‌ ఫోర్సెస్‌కు, స్టేట్ పోలీసులకు ఛాలెంజ్‌ విసిరిన నక్సలిజం ఉనికి...ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 1969లో వెస్ట్‌ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి ఉవ్వెత్తున ఎగసి లక్షలాది మందిని కదిలించిన నక్సలిజం ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది.

New Update
41 Maoists Surrender Before Telangana DGP in Hyderabad

Maoists Surrender

మావోయిస్టు ఉద్యమానికి అంతిమ దశ...సాయుధ పోరాటం ఇక ముగిసిన అధ్యాయం... 

Maoist movement : 2026 మార్చి 31...నక్సలిజం అంతానికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్న డెడ్‌లైన్‌ ఇది. దశాబ్దాల పాటు సెంట్రల్‌ ఫోర్సెస్‌కు, స్టేట్ పోలీసులకు ఛాలెంజ్‌ విసిరిన నక్సలిజం ఉనికి...ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 1969లో వెస్ట్‌ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో అంటుకున్న నిప్పు..దేశంలో వందలాది జిల్లాలకు పాకింది.  ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగసి లక్షలాది మందిని కదిలించిన నక్సలిజం ఇప్పుడు ఎందుకు అంతిమ దశకు చేరుకుంది?  

నక్సల్‌ మూవ్‌మెంట్‌ ఎక్కడ స్టార్టయ్యిందంటే?

వెస్ట్‌ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా నక్సల్బరీ విలేజ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ నక్సలైట్‌ ఉద్యమానికి బీజం వేసింది. 1967 మే 25న భూస్వాములకు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సాయుధ పోరాటంతోనే భూ స్వాముల దోపిడి నుంచి విముక్తి సాధ్యమని నమ్మిన యువకులు 1969లో CPI-ML పార్టీని స్థాపించారు. ఈ Armed Revolution  బెంగాల్ నుండి బిహార్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌కు పాకింది. 
 
అయితే లీడర్ల మధ్య ఇగో క్లాష్‌ తో పాటు సిద్ధాంత పరమైన విభేధాలతో ML పార్టీ ముక్కలైంది. మహదేవ్ ముఖర్జీ, వినోద్ మిశ్రా, కొండపల్లి సీతారామయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కూర రాజన్న,  ఇలా అనేక మంది లీడర్ షిప్ లో ML పార్టీలు పుట్టాయి. 1978లో జగిత్యాల జైత్రయాత్ర చేసిన రైతు కూలి సంఘం 1980లో CPI-ML పీపుల్స్ వార్ గా మారింది. దీనికి కొండపల్లి సీతారామయ్య లీడర్. ఈ పార్టీ మిగిలిన ఎంఎల్ పార్టీల కన్నా ఎక్కువ మందిని ఆకర్షించి బలంగా ఎదిగింది. 

దున్నే వానికే భూమి, పీడిత జన విముక్తి కోసం సాయుధ పోరాటం నినాదాలతో నక్సలైట్ పార్టీలు ఆవిర్భవించాయి. అందులో పీపుల్స్ వార్‌, ప్రజాపంథా, జనశక్తి, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, విశ్వం ఇలా అనేక గ్రూపులు పుట్టుకొచ్చాయి.అయితే.. వర్గ శత్రు నిర్మూలన పేరిట జరిపిన పోరాటం మితిమీరిన హింసకు దారి తీసింది.

నక్సలైట్ల హింసలో ముఖ్యమైన ఘటనలు చూస్తే...

నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన వార్ లో ఇప్పటి వరకు 13 వేల మంది చనిపోయినట్లు అంచనా. ఇందులో 6 వేల మంది నక్సల్స్, 2 వేల మంది పోలీసులు ఉండగా.. 5 వేల మంది అమాయక జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు.
1993 జనవరి 27 న హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో ఐపీఎస్ ఆఫీసర్ కె.ఎస్. వ్యాస్ ను పీపుల్స్‌వార్‌ కాల్చి చంపారు. 
1999 సెప్టెంబ‌ర్ 4 న SR నగర్ చౌరస్తాలో ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్‌ చంద్ర కాల్చివేత.
2000 మే సెవెన్త్ న ఘట్ కేసర్ వద్ద ల్యాండ్ మైన్ పేల్చి నాటి ఏపీ హోం మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డిని హత్య చేశారు.
2003 అక్టోబర్‌ ఫస్ట్ న AP CM చంద్రబాబు కాన్వాయ్‌పై అలిపిరి దగ్గర క్లైమోర్ మైన్లతో అటాక్‌ చేశారు. 
2007లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) MP సునీల్ మహతో హత్య.
2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు చేసిన అటాక్ లో 76 మంది CRPF సిబ్బంది మృతి చెందారు. 
తర్వాత నెల రోజుల్లోనే వెస్ట్‌ బెంగాల్‌లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తొలగించడంతో 148 మంది అమాయకులు బలయ్యారు.
మే 2013లో దర్భా లోయలో నక్సలైట్లు జరిపిన మెరుపుదాడిలో 29 మంది స్పాట్ డెడ్ అయ్యారు. ఛత్తీస్ ఘడ్ పీసీసీ చీఫ్ నంద్ కుమార్ పటేల్, సల్వా జుడుం ఉద్యమ నిర్మాత మహేంద్ర కర్మ, మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా కూడా ఈ దాడిలో చనిపోయారు.
2018 సెప్టెంబర్ 23 న అరకు లోయలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపారు. 
ఇవి కాకుండా బస్సులు, బ్యాంకులు, టవర్ల దగ్ధం వంటి విధ్వంసాలకు పాల్పడ్డారు. 
కోవర్టులు, వర్గ శత్రువుల పేరిట వందలాది మందిని హతమార్చారు నక్సలైట్లు.
ఎన్ కౌంటర్ల పేరిట స్టేట్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ జరిపిన కాల్పుల్లో కూడా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
 
నక్సలైట్ పార్టీల పతనానికి కారణాలు

మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐడియాలజీని, స్ట్రాటజీస్ ను, టాక్ టిక్స్ ను ఛేంజ్ చేసుకోకపోవడం మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. ప్రజా బలం కన్నా ఆయుధ బలాన్నే ఎక్కువగా నమ్ముకోవడం.లీడర్ల మధ్య ఇగో క్లాష్‌ కారణంగా పార్టీలో చీలికలు రావడం.వర్గశత్రు నిర్మూలన పేరిట జరిగిన హత్యాకాండ, విధ్యంసాలకు యూత్ నుంచి సపోర్ట్ రాలేదు. దీంతో పార్టీలోకి రిక్రూట్మెంట్ ఆగిపోయింది.సెక్యూరిటీ ఫోర్సెస్‌ బలాన్ని అంచనా వేయడంలో నక్సలైట్లు ఫెయిల్ అయ్యారు.ప్రజల సపోర్ట్ ను, గెరిల్లా బలాన్ని పెంచుకోవడంలో ML పార్టీలు సక్సెస్ కాలేకపోయాయి.సెంట్రల్ ఫోర్సెస్ దాడులు, సరెండర్లు నక్సల్స్ ను ఎలా దెబ్బ తీశాయి

నక్సల్స్ ఏరివేతకు సెంట్రల్ అండ్ స్టేట్ ఫోర్సెస్ రెగ్యులర్ గా ఆపరేషన్స్ చేపట్టాయి. అయితే.. 2017లో చేపట్టిన Operation Samadhan మావోయిస్టు నెట్ వర్క్ ను భారీగా దెబ్బతీసింది. ఇక 2025 ఏప్రిల్‌21న ఆపరేషన్ కగార్ స్టార్ట్‌ అయింది. ఇది గవర్నమెంట్ చేపట్టిన Final Assault.-- ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, తెలంగాణలో గడచిన ఇయర్‌లో 270 మంది నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. --2025 మే ట్వంటీ ఫస్ట్ న జరిగిన మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ తో భారీ ఎదురుదెబ్బ తగిలింది.AP, తెలంగాణ, ఛత్తీస్ గడ్ లలో జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో సీనియర్ లీడర్లు సుధాకర్, గణేష్, టెక్‌ శంకర్, అరుణ, పాక హనుమంతు, హిడ్మా మృతి చెందారు.-- సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న సరెండర్ అయ్యారు.
ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బర్సీ దేవా, సీనియర్ లీడర్ రాజిరెడ్డి సరెండర్ తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ జరిగింది.  Last Yearలో 680 మంది నక్సలైట్లు అరెస్టు అయితే 1500 మంది సరెండర్ అయ్యారు. 
 
నక్సలైట్ల ఫెయిల్యూర్స్ తో పాటు వారికి  వ్యతిరేకంగా మారిన పరిస్థితులు 

గ్లోబలైజేషన్‌తో యూత్ కు ఎంప్లాయిమెంట్ అవకాశాలు బాగా పెరిగాయి.ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ కోసం రూరల్ ఏరియా నుంచి యూత్ సిటీస్ కు మైగ్రేట్ అయిపోయారు.రూరల్ ఏరియాల్లో డెవలప్మెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. పేదరికం, ఆకలి చావులు తగ్గుముఖం పట్టాయి.ఫ్రీ రేషన్, ఫ్రీ హెల్త్, ఎడ్యుకేషన్ వంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి.  సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి తీవ్రమైన ఎదురు దాడులు, అణచివేత పెరగడం. నక్సలైట్ అగ్రనేతల వృద్ధాప్యం.. అనారోగ్య సమస్యలు  మావోయిస్టులను దెబ్బతీశాయి.
 
నక్సలైట్ల ఏరివేతలో గవర్నమెంట్ పైచేయి  

ఫారెస్ట్ లో ఎవ్రీ మూమెంట్ ను ట్రాక్ చేయగలిగే సెన్సార్లు, మొబైల్ ఫోన్ల కారణంగా నక్సలైట్ల కదలికలను మానిటర్ చేయగలిగారు.మోడర్న్ టెక్నాలజీని USE చేయడం గవర్నమెంట్ కు బాగా కలిసొచ్చింది. లాంగ్ రేంజ్ వెపన్స్, బుల్లెట్ ప్రూఫ్‌, మైన్ ప్రూఫ్ వెహికిల్స్, నైట్ విజన్ కెమెరాలు, సిగ్నల్ జామర్స్ తో నక్సల్స్ ను దెబ్బతీయగలిగారు.-- నక్సల్స్ ఎఫెక్టెడ్‌ స్టేట్స్‌ మధ్య పెరిగిన కో-ఆర్డినేషన్, యూత్‌ను అట్రాక్ట్ చేసేలా స్కీమ్స్ Implement చేసి నక్సలిజం వైపు అట్రాక్ట్ కాకుండా అడ్డుకున్నారు. మావోయిస్టులకు వెపన్స్ అందకుండా చేయగలిగారు. -- లొంగిపోయిన వారికి భారీ రివార్డులు ఇవ్వడం, వారిపై ఉన్న కేసులు కొట్టివేయడం వల్ల భారీ సంఖ్యలో లీడర్స్, కేడర్ సరెండర్ అయ్యారు. 
 
మావోయిస్టు పార్టీ ప్రజెంట్ స్టేటస్

ఒకపుడు 10 మందితో కూడిన క్యాడర్‌ కలిగిన మావోయిస్టు పార్టీ ఎన్‌కౌంటర్లు, సరెండర్ల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 లోపే గెరిల్లాలు ఉన్నారని INTELLIGENCE వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీకి గుండెకాయ లాంటి తెలంగాణలో ప్రస్తుతం 17 మంది మాత్రమే మిగిలారని ఇటీవల DGP అనౌన్స్‌ చేశారు. వీరిలో నలుగురు కేంద్ర కమిటీలో, ఐదుగురు రాష్ట్ర కమిటీలో ఉన్నారు. మిగిలిన వారిలో మెజారిటీ చత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్‌, నారాయణపూర్‌ ఫారెస్టులకు పరిమితమయ్యారు. 
 
సరెండర్ అయిన నక్సలైట్ లీడర్స్ ఏమంటున్నారు?

ఉద్యమ లక్ష్యాలను సాధించే పరిస్థితి కనుచూపు మేరలో లేదంటున్నారు తొలి మహిళా మావోయిస్టు మిలిటరీ కమాండర్ శంబాల దేవి. అడవిలో ఉన్న నక్సల్ లీడర్స్ ఇప్పటికైనా సరెండర్ కావాలని సీనియర్ లీడర్ ఆజాద్‌ అడ్వయిజ్ ఇస్తున్నారు. టెక్నాలజీని అప్‌డేట్ చేసుకోలేకపోవడం, OUTDATED STRATEGIES ఫాలో అవడం నక్సలైట్లు చేసిన పెద్ద తప్పిదమనేది ఆయన ఒపీనియన్. పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేసిన మల్లోజుల వేణుగోపాల రావు సాయుధ పోరాటం ఓ విఫల ప్రయోగమని  కుండబద్దలు కొట్టారు. 1980 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయన అంటున్నారు. మావోయిస్టు పార్టీ ప్రస్తుత దీన పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణమని సరెండర్ అయిన టాప్ కమాండర్ బర్సె దేవా గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు.

పౌర హక్కుల సంఘాల వాదన ఏంటి ?

Government బలంగా మారి, మావోయిస్టు పార్టీ వీక్‌ అయిందనేది ప్రొఫెసర్ హరగోపాల్ ఆర్గ్యుమెంట్. నక్సలైట్లను అంతం చేసినంత మాత్రాన నక్సలిజం అంతం కాదని ఆయన అంటున్నారు. ట్రైబల్స్ ను ఫారెస్ట్ నుండి తరిమికొట్టేందుకే ఆపరేషన్ కగార్‌ చేపట్టి నక్సల్స్ ను చంపేస్తున్నారనేది CPI జనరల్‌ సెక్రటరీ D.రాజా చేస్తున్న విమర్శ. 
 
నక్సలిజం పతనంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను డెవలప్డ్ ఏరియాలతో లింక్ చేస్తామన్నారు. ట్రైబల్ ఏరియాలో డెవలప్‌మెంట్‌ లేకపోవడానికి నక్సలిజమే కారణమనేది హోం మినిస్టర్ అమిత్ షా ఒపీనియన్. అయితే.. మావోయిస్టుల అంశాన్ని సోషల్‌యాంగిల్‌లో చూడాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 
 
నక్సల్స్ వల్ల హింస, విధ్వంసమే జరిగిందా..? 

దున్నేవాడిదే భూమి అనే నినాదం వల్ల ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను కొంత సీరియస్‌గానే ఇంప్లిమెంట్‌ చేశాయి గవర్నమెంట్స్. దీని వల్ల పూర్ పీపుల్ కి కొద్దిమేర ల్యాండ్స్ దక్కాయి. ట్రైబల్ ఏరియాలో నాన్‌ ట్రైబల్స్ EXPLOITATIONను కొంత మేర నక్సల్స్ అడ్డుకున్నారు. ట్రైబల్ ప్రాంతాల్లో ఫారెస్ట్‌ ఆఫీసర్ల హరాస్‌మెంట్‌ను కూడా తగ్గించగలిగారు. ట్రైబల్ రైట్స్ కోసం 'పెసా' (PESA) చట్టం, అటవీ హక్కుల చట్టం -2006 రావడం వెనుక నక్సలైట్లు కీ రోలో ప్లే చేశారు. 

నక్సలైట్ మూమెంట్ తో జరిగిన నష్టాలు చూస్తే..

ట్రైబల్ ఏరియాలో రోడ్లు, రైల్వే లైన్లు, టవర్ల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతాలు వెనుకబడిపోయాయి. ప్రాజెక్టులను, మైనింగ్‌ను అడ్డుకోవడం వల్ల డెవలప్‌మెంట్ ఆగిపోయింది. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన హింసలో వేలాది మంది ఇన్నోసెంటో పీపుల్ ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫార్మర్లనే నెపంతో వందలాది మంది గిరిజన యువకులను మావోయిస్టులు కాల్చి చంపారు. నక్సలైట్ల భయం వల్ల INTERIOR PLACESలో SCHOOLS, HOSPITALSను నడపలేకపోయింది ప్రభుత్వం.  రైల్వే ట్రాకులను పేల్చివేయడం, బస్సులను తగులబెట్టడం వల్ల మారుమూల ప్రాంతాలకు బయటి ప్రపంచంతో రిలేషన్స్‌ తెగిపోయాయి.
 

Advertisment
తాజా కథనాలు