గుజరాత్‌లో ఘోరం.. 10 నెలల చిన్నారిపై అత్యాచారం

గుజరాత్ లో మరో దారుణం జరిగింది. కామాంధుడి చేతిలో మరో పసిగుడ్డు బలైంది. బరూచ్‌లో పనోలి గ్రామంలో 10 నెలల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు దీపక్ కుమార్ లాల్ బాబు సింగ్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
drer

Gujarat: గుజరాత్ లో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో పసిగుడ్డు బలైంది. బరూచ్‌లో పనోలి గ్రామంలో 10 నెలల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు దీపక్ కుమార్ లాల్ బాబు సింగ్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. గుజరాత్‌లోని బరూచ్‌ జిల్లా పనోలి గ్రామంలో ఆదివారం 10 నెలల పాప తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఎవరూ చూడకముందు చిన్నారిని ఎత్తుకెళ్లిన దీపక్ కుమార్ లాల్ బాబు సింగ్ అనే వ్యక్తి ఇంటి దగ్గరలోనే నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుశాల్ ఓజా తెలిపారు.

ఇక చిన్నారి తల్లి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు చెప్పారు. చిన్నారి నాయనమ్మ పాప కేకలు విని పరుగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తీవ్రగాయాలై రక్తం కారుతోంది. వెంటనే విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పాపను బరూచ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిందితుడిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment