/rtv/media/media_files/2026/05/17/congress-2026-05-17-07-50-01.jpg)
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం రాజీవ్ భవన్ లో ఒక వింత దొంగతనం జరిగింది. గాంధీ చౌక్ లాంటి వీఐపీ జోన్‌లో ఉన్న ఈ ఆఫీస్ బాత్‌రూమ్‌లలోకి చొరబడిన దొంగలు.. ఏకంగా 72 ఖరీదైన నల్లాలు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా, వెళ్తూ వెళ్తూ ఆఫీస్ ఫ్లోర్‌పై లవ్ యూ అని ఒక నోట్ రాసి పెట్టి మరీ పరారయ్యారు.
నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే వీఐపీ ఏరియాలోని కాంగ్రెస్ ఆఫీస్‌లోకి చొరబడిన దొంగలు.. బాత్‌రూమ్‌లలోని ఖరీదైన నల్లాలను అత్యంత నైపుణ్యంతో ఊడదీశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, పట్టుబడతామనే భయం అస్సలు లేకుండా ఈ చోరీకి పాల్పడ్డారు. ఉదయం ఆఫీస్‌కు వచ్చిన సిబ్బంది బాత్‌రూమ్‌లలో నల్లాలు మాయమవ్వడం, నేలపై లవ్ యూ అని రాసి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు.
ఇది మూడోసారి కావడం
విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పాఠక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన మండిపడ్డారు.రాజీవ్ భవన్‌లో ఇలా దొంగతనం జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. వరుసగా దొంగతనాలు జరుగుతున్నా భద్రత కరువైందని నేతలు ఆరోపిస్తున్నారు.
నగరంలో తిరుగుతున్న డ్రగ్స్ బానిసలు, సంఘ విద్రోహ శక్తులే ఈ పని చేసి ఉంటారని పాఠక్ అనుమానం వ్యక్తం చేశారు. దొంగతనం చేసి నేలపై లవ్ యూ అని సందేశం రాయడం అనేది.. పోలీసులు, స్థానిక యంత్రాంగాన్ని దొంగలు నేరుగా ఎగతాళి చేయడమేనని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Follow Us