/rtv/media/media_files/2025/02/17/zAUIIhjS7nNw9JQbMXZA.jpg)
tamil magazine Photograph: (tamil magazine)
మూడు రోజులు క్రితం ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పర్యటనపై తమిళ మ్యాగజైన్ ఓ కార్టూన్ గీసింది. ప్రస్తుతం ఆ కార్టూన్ సంచలనంగా మారింది. ట్రంట్ ముందు మోదీకి కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి కూర్చొబెట్టినట్లు ఈ చిత్రంలో ఉంది. ఈ బొమ్మని వికటన్ అనే తమిళ మ్యాగజైన్ వెబ్‌సైట్ ప్రచురించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. వికటన్ మ్యాగజైన్ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ చర్యలు చేపట్టడం విమర్శలకు దారితీసింది. శుక్రవారం రాత్రి నుంచి ‘వికటన్’ వెబ్‌సైట్‌ను కేంద్రం బ్లాక్ చేసినట్టు తెలిసింది. కేంద్రం చర్యల్ని తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ నాయకులు ఖండించారు.
Tamil Vikatan Magazine made this epic cartoon of Modi & Trump.
— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 16, 2025
Now the news is that Narendra Modi got angry & has banned this magazine website 😂🤡 pic.twitter.com/xLlxz8WVmG
ఇది కూడా చదవండి: ఛాతీలో మంటగా, నోటిలో పుల్లగా ఉందా.. కారణం ఇదే!
చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు కట్టి అమెరికా నుంచి భారతీయ వలసదార్లను బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ వికటన్ మ్యాగజైన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతులకు, కాళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకెళ్లు వేసినట్టుగా కార్టూన్ ప్రచురించింది. ఫిబ్రవరి 10న మ్యాగజైన్ కవర్‌పేజీపై ప్రచురించిన కార్టూన్ వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వం వికటన్ మ్యాగజైన్‌పై నిషేదం విధించింది.
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!