DMK దయాదాక్షిణ్యాలపైనే విజయ్ ప్రభుత్వం నడుస్తోంది: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై డీఎంకే అధినేత,మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళగ వెట్రి కజగం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఈ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేయలేదన్నారు.

New Update
mk stalin

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై డీఎంకే అధినేత,మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళగ వెట్రి కజగం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఈ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేయలేదని, ప్రస్తుతం డీఎంకే దయాదాక్షిణ్యాలపైనే ఇది నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన స్టాలిన్, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రాజకీయ గాలి అనడం కంటే సినిమా సునామీ అనడం కరెక్ట్ అని పేర్కొన్నారు. ఓటర్లు రాజకీయ సిద్ధాంతాలను చూసి కాకుండా, కేవలం తమకు ఇష్టమైన ఒక పాపులర్ సినిమా స్టార్‌పై ఉన్న ఉత్సాహంతోనే విజయ్‌కు ఓటేశారని ఆయన అన్నారు. అభిమాన నటుడు పార్టీ పెట్టాడనే తొందరపాటులో ప్రజలు ఓటు వేశారని, కానీ కొద్ది రోజుల్లోనే ఈ బొమ్మపై వారికి మోజు తీరిపోతుందని ఎద్దేవా చేశారు. చివరికి ఒక బిడ్డ తన తల్లి కోసం వెతికినట్టుగా, ప్రజలు మళ్లీ డీఎంకే కోసమే వెతుకులాడతారని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో టీవీకే పార్టీకి ఒంటరిగా సొంత మెజారిటీ మార్కు అయిన 118 సీట్లు కూడా రాలేదని, అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఎంతవరకు నిలకడగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశ్నించారు. వారికి కనీసం మెజారిటీ కూడా రాలేదని, ఈ రోజు ఆ ప్రభుత్వం బతికి బట్టకడుతోందంటే దానికి కారణం తమ కరుణేనని, ఏ క్షణంలోనైనా, ఏ రోజునైనా ఈ ప్రభుత్వం కూలిపోవచ్చని హెచ్చరించారు. అలాగే ఏఐఏడీఎంకే పార్టీని చీల్చాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి విఫలమయ్యాయని, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని ఆరోపించారు. 

కమ్యూనిస్ట్ పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) వంటి పార్టీలు మొదట విజయ్ ప్రభుత్వానికి కేవలం బయట నుంచే మద్దతు ఇస్తామని చెప్పి, ఆ తర్వాత క్యాబినెట్ లో చేరిపోయాయని ఆయన గుర్తుచేశారు. ఏం జరుగుతుందో తాము వేచి చూస్తామని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఐదేళ్లు సాగదని స్టాలిన్ స్పష్టం చేశారు.

డీఎంకే కూటమి నుంచి 

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలున్న సభలో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీకి కొద్దిగా దూరంలో ఆగిపోయింది. నిజానికి కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమిలోనే భాగస్వాములుగా పోటీ చేశాయి. కానీ ఫలితాలు వచ్చిన వెంటనే, 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేసి విజయ్‌కు మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా విజయ్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయన రాష్ట్రంలో తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. 

Advertisment
తాజా కథనాలు