BIG BREAKING: తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్! లోక్‌భవన్‌కు విజయ్‌

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంటాయి. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ తన అధికారిక కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. టీవీకే అధినేత విజయ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. విజయ్ మరికొద్ది సేపట్లో గవర్నర్ ను కలవనున్నారు.

New Update
FotoJet - 2026-05-09T181627.032

Tamil Nadu Governor Appointment to TVK Vijay

BIG BREAKING: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంటాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిణామాలు సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.తమిళనాడు ద్రవిడ రాజకీయం మరోసారి హీటెక్కింది. క్షణక్షణానికి మారుతున్న సమీకరణాలు, అనూహ్య పరిణామాలతో చెన్నై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో త్వరలోనే ఒక పెద్ద రాజకీయ మార్పు రాబోతోందనే సంకేతాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ ముందుకు రావడంతో ఆయనకు వివిధ పార్టీలు మద్దతు ఇచ్చాయి. మొత్తం ఆయనకు 118 సభ్యుల మద్దతు లభించడంతో గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. అయితే తొలుత విజయ్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ లభించలేదు. ఆయన కేరళం పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రచారం సాగింది.

అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, తాజా డెవలప్‌మెంట్స్ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ తన అధికారిక కేరళం పర్యటనను అత్యవసరంగా రద్దు చేసుకున్నారు. రాజ్ భవన్‌కు అందుతున్న సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి గవర్నర్ చెన్నైలోనే అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ సస్పెన్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ.. నేడు సాయంత్రం 6:30 గంటలకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర, ప్రముఖ నేత విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయనడానికి ఈ భేటీయే ప్రత్యక్ష నిదర్శనం.

గవర్నర్ రాజేంద్ర నుంచి విజయ్‌కు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమకు మద్దతు ఇస్తున్న మెజార్టీ సభ్యుల (ఎమ్మెల్యేల) పూర్తి వివరాలను, సంతకాలతో కూడిన జాబితాను వెంటనే లోక్‌భవన్‌కు (రాజ్‌భవన్‌కు) సమర్పించాలని గవర్నర్ కోరారు. బలాబలాల నిరూపణకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.గవర్నర్ ఆదేశాల మేరకు ఇప్పటికే మద్దతుదారులైన సభ్యుల పూర్తి వివరాలతో కూడిన ఫైల్‌ను విజయ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లో విజయ్ స్వయంగా గవర్నర్ రాజేంద్రను కలిసి ఈ కీలక పత్రాలను అందజేయనున్నారు.

 తమిళనాడు అసెంబ్లీలో తగినంత బలం తమకు ఉందనే విషయాన్ని గవర్నర్‌కు నిరూపించి, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడమే విజయ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ భేటీ ముగిసిన వెంటనే తమిళనాడు రాజకీయ చిత్రపటంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు