Tamilanadu: ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఓ శుభవార్త చెప్పింది.ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు పొంగల్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

New Update
bonus

bonus

Tamilanadu: తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి పండగ కానుకను ప్రకటించింది. రాష్ట్రంలో పొంగల్ స్పెషల్ బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ కానుకగా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.163.81 కోట్లు కేటాయించినట్లు సర్కార్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. పొంగల్ బోనస్‌తోపాటు రాష్ట్రంలోని గ్రూప్ సీ, డీ కేటగిరీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అసిస్టెంట్లకు స్పెషల్ పే గురించి ను ప్రకటించింది. 

Also Read: Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఈ ప్రెస్ నోట్ ప్రకారం.. గ్రూప్ సీ, డీ ఉద్యోగులు, టీచర్లకు స్పెషల్ పే కింద రూ.3వేల వరకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రోజువారీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి.. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కనీసం 240 రోజుల సర్వీసు ఉంటేనే కన్సాలిడేటెడ్ వేతనం, స్పెషల్ టైమ్ స్కేల్ పే పొందడానికి అర్హులు అవుతారని ప్రభుత్వం తెలిపింది. అలాంటి వారికి స్పెషల్ బోనస్ కింద రూ.1000 అందించనున్నట్లు చెప్పింది. 

Also Read: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని వివరించింది. ఇక పొంగల్ గిఫ్ట్ కింద గ్రూప్ సీ, డీ.. పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ లకు రూ.500 చొప్పున అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

రూ. 3వేల వరకు బోనస్..

గ్రూప్ సీ, డీ కేటగిరీకి చెందిన రెగ్యులర్, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులకి కూడా రూ. 3వేల వరకు బోనస్ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ టైమ్ స్కేల్‌ల వేతనాలపై పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉపాధ్యాయులకు రూ.1000 ప్రత్యేక అడ్ హక్ బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పింది.

2024 అక్టోబర్‌లో చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే గ్రూప్ సీ, డీ కేటగిరీలకు చెందిన అర్హులైన ఉద్యోగులందరికీ కనిష్టంగా రూ.8,400.. గరిష్టంగా రూ.16,800 బోనస్ అందజేసినట్లు చెప్పింది. ఇది 8.33 శాతం బోనస్, 11.67 శాతం ఎక్స్‌గ్రేషియాకు సమానమని చెప్పింది.

అదేవిధంగా.. కేరళ ప్రభుత్వం కూడా గతేడాది కూడా ఓనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ. 4 వేల బోనస్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. బోనస్‌కు అర్హత లేని ఉద్యోగులకు పండగ భత్యం కింద రూ.2,750 ఇవ్వనున్నారు.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు

Also Read:  TTD: ఏడాదికి లక్ష బ్రేక్‌ దర్శనాలు..అంతా బాబాయి చలవే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment