West Bengal : వెస్ట్ బెంగాల్ లో హింస..  సువెందు అధికారి పీఏ దారుణ హత్య!

పశ్చిమ బెంగాల్ లో కొత్త ఏర్పాటుకు ముందు దారుణం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు సువెందు అధికారి పీఏ చంద్రనాధ్ రథ్  దారుణ హత్యకు గురయ్యారు.  ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.  

New Update
suvendu adhikari

పశ్చిమ బెంగాల్ లో కొత్త ఏర్పాటుకు ముందు దారుణం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు సువెందు అధికారి పీఏ చంద్రనాధ్ రథ్  దారుణ హత్యకు గురయ్యారు.  ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.  బుధవారం రాత్రి మధ్యగ్రామ్ వద్ద కారులో వెళ్తున్న చంద్రపై బైక్‌లపై వచ్చిన దుండగులు 8 నుండి 9 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇందులో చంద్ర అక్కడికక్కడే మరణించాడు. చంద్రనాథ్ తన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.  సువెందు అధికారి కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అయితే  చంద్రనాధ్ రథ్  హత్య వెనుక సీఎం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ హస్తం ఉందని  సువెందు అధికారి ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండిస్తోంది. దీనిపై కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తో్ంది. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొంది. కాగా ఎన్నికల తరువాత జరిగిన చెలరేగిన హింసలో ఇప్పటికే ఐదుగురు చనిపోయారు.  

ఈ ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ దాడికి దుండగులు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, సదరు వాహనం నంబర్ ప్లేట్ నకిలీదని, దానిని ట్యాంపర్ చేశారని డీజీపీ సిద్ధ్ నాథ్ గుప్తా వెల్లడించారు. ఘటనా స్థలం నుండి తూటాలు,  పేల్చిన క్యాట్రిడ్జ్‌లను రికవరీ చేశామని, ప్రత్యక్ష సాక్షుల మొజూలు నమోదు చేస్తున్నామని ఆయన తెలిపారు.

బీజేపీ ప్రభంజనం

కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 294 స్థానాలకు గాను  208 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీతో రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,105 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ ప్రజా తీర్పును దోచుకుందని  దాదాపు 100 సీట్లలో రిగ్గింగ్ జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. అందుకే తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. గవర్నర్ ఆర్.ఎన్. రవి దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే క్రమంలో ఆమెను పదవి నుండి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

Advertisment
తాజా కథనాలు