West Bengal : దెబ్బ మీద దెబ్బ.. మమతా బెనర్జీ  మళ్లీ వెనుకంజ!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానిపూర్ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు సాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.

New Update
Tamil Nadu CM Stail and Cong in tacit understanding with BJP, Says Mamata benarjee

Tamil Nadu CM Stail and Cong in tacit understanding with BJP, Says Mamata benarjee

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానిపూర్ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు సాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. రెండో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి ఆమెపై సువెందు అధికారి 1,558 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మమతా బెనర్జీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువెందు అధికారి, ఈసారి ఆమె సొంత గడ్డ అయిన భవానిపూర్‌లోనే సవాల్ విసరడం విశేషం. మొదటి రౌండ్‌లో మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రెండో రౌండ్ వచ్చేసరికి సువెందు 1,558 ఓట్ల లీడ్‌లోకి వెళ్లారు. బెంగాల్ వ్యాప్తంగా సాగుతున్న పోరులో భవానిపూర్ ఫలితం అత్యంత కీలకంగా మారింది. బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గానూ, బీజేపీ ప్రస్తుతం మేజిక్ ఫిగర్ (148) దాటి 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, టీఎంసీ 110-115 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది.

Advertisment
తాజా కథనాలు