/rtv/media/media_files/2026/05/08/tvk-chief-vijay-2026-05-08-21-43-40.jpg)
TVK Chief Vijay
టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారంపై హైడ్రామా నడుస్తోంది. శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఇంకా ఓకే చెప్పలేదు. ఇప్పటిదాకా 116 ఎమ్మెల్యేల లేఖలు మాత్రమే గవర్నర్‌కు అందాయి. VCK పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల లేఖలు అందలేవు.--- దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో మరోసారి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ? లేదా ? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
కాంగ్రెస్ మద్దతుతో టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6గురు ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అయితే శుక్రవారం వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ విజయ్‌కు మద్దతిచ్చాయి. సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, సీపీఎం నుంచి ఇద్దరు, వీసీకే నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇచ్చారు. దీంతో టీవీకే ఎమ్మెల్యేల బలం 118కి చేరింది. అయితే వీసీకే నుంచి ఎమ్మెల్యేల లేఖలు గవర్నర్‌కు ఇంకా అందలేదు. దీంతో టీవీకే బలం 116కు చేరింది. అయితే వీసీకే పార్టీ తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టీవీకే.. ఆ పార్టీకి పట్టాణాభివృద్ధి శాఖ ఇస్తామని చెప్పినట్లు సమాచారం.
Follow Us