/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
Supreme Court fires on Free guarantees
Supreme Court: దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడట్లేదని తెలిపింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని పేర్కొంది. ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. ఈ మేరకు పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్.గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉద్దేశం మంచిదే కానీ..
ఈ మేరకు ఎన్నికల్లో నాయకులు ఇచ్చే ఉచిత పథకాల హామీలు మంచివి కావు. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయని జనాలు పని చేయడం మానేస్తారు. అయితే ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ఉద్దేశం మంచిదే కానీ జనాలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని తెలిపింది. నిరాశ్రయులైన వారిని ప్రధాన స్రవంతి సమాజంలో చేర్చాలి. దేశాభివృద్ధికి దోహదపడటానికి అనుమతించాలి. వారి పట్ల మీకున్న శ్రద్ధను మేము చాలా అభినందిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాల సందర్శన.. కారణం అదే.. పవన్ కీలక ప్రకటన!
అయితే కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తిచేసే పనిలో ఉందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి న్యాయస్థానానికి తెలిపారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. దీంతో నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పనిచేస్తుందో తమకు స్పష్టతనివ్వాలని కోర్టు ఆదేశించింది. మరో 6 వారాల తర్వాత దీనిపై విచారణ జరిపస్తామని చెప్పింది.
ఇది కూడా చదవండి: Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!