Kavya Maran : పెళ్లి పీటలెక్కనున్న సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్...వరుడి తరుపున సూపర్‌ స్టార్‌ ఎంట్రీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌తో ఆమె పెళ్లి ఖాయమైందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

New Update
FotoJet - 2026-05-21T191933.302

kavya maran and anirudh

Kavya Maran : ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో , సినిమా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ మ్యాచ్‌ల్లో తన హావభావాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కావ్య మారన్, అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌తో ఆమె వివాహం జరగనుందనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వైరల్ వార్తలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆసక్తికరమైన అంశాలు ఇలా ఉన్నాయి:

నిజానికి కావ్య మారన్, అనిరుధ్ మధ్య ప్రేమాయణం సాగుతోందనే ప్రచారం ఈనాటిది కాదు. గతంలోనూ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ, విదేశాల్లో ఈ జంట కలిసి తిరిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఆ తర్వాత అవన్నీ కేవలం రూమర్స్ (పుకార్లు) మాత్రమేనని తేలిపోవడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి పెళ్లి అంశం సరికొత్తగా తెరపైకి రావడం గమనార్హం.గతంలో వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలే అయినప్పటికీ.. ఈసారి మాత్రం వీరిద్దరి వివాహం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలోనే జరగనున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో (కోలీవుడ్) గట్టిగా వినబడుతోంది. ప్రస్తుతం కావ్య, అనిరుధ్ కుటుంబాల మధ్య వివాహానికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు కుదిరితే, ఈ 2026 ఏడాది చివరలోనే వీరిద్దరి వివాహం వైభవంగా జరిగే అవకాశం ఉందని సమాచారం.

 ఈ పెళ్లి ముచ్చటలో అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ క్రేజీ జంటను కలిపేందుకు స్వయంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగినట్లు టాక్ నడుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. రజినీకాంత్‌కు వరుసకు మేనల్లుడు (భార్య తరపున బంధువు) అవుతాడు. ఈ క్రమంలోనే అనిరుధ్ తరపున సంబంధం మాట్లాడేందుకు రజినీకాంత్ స్వయంగా చొరవ తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సన్ నెట్‌వర్క్ అధినేత, కావ్య మారన్ తండ్రి అయిన కళానిధి మారన్‌తో రజినీకాంత్‌కు దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రజినీకాంత్ పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు కూడా చేశారు. ఈ పరిచయంతోనే రజనీకాంత్ స్వయంగా కళానిధి మారన్‌తో మాట్లాడారని, సూపర్ స్టార్ స్వయంగా వచ్చి అడగడంతో మారన్ కుటుంబం కూడా ఈ పెళ్లి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిందని వినికిడి.

ప్రస్తుతం కోలీవుడ్ మీడియా, సోషల్ మీడియా వేదికలపై ఈ పెళ్లి వార్త ఊపుందుకున్నప్పటికీ.. అటు మారన్ కుటుంబం నుంచి కానీ, ఇటు అనిరుధ్ వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయమై ఇరు కుటుంబాలు స్పందించి, అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అభిమానులు,నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#IPL 2025 #Anirudh Ravichander #kavya-maran #sun-risers-hyderabad #marrige #rajani-kanth #Kalanidhi Maran
Advertisment
తాజా కథనాలు