అంతరిక్ష రంగంలో రోజురోజకు సాంకేతిక అభివృద్ధి చెందుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట నింగిలోకి శాటిలైట్లు పంపించే ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే భారత్‌లో ప్రైవేటు రంగంలో కూడా స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు మరో కీలక ముందడుగు పడింది. స్పేస్ రెగ్యులేటర్, ప్రమోటర్ అయిన 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్' (IN-SPACe) కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ATL) దేశంలోనే మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా నిలవనుందని పేర్కొంది. Also Read: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు! అనంత్ టెక్నాలీస్ లిమిటెడ్ అనేది అంతరిక్ష ప్రాజెక్టు పనులను చేపట్టనుంది. శాటిలైట్‌లను అభివృద్ధి చేయడం, లాంచ్ చేయడం లాంటివి చేయనుంది. ఈ సందర్భంగా IN-Space ఛైర్మన్ పవన్ గోయెంకా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' మేము చేసిన ఈ ప్రకటన భారత అంతరిక్ష రంగంలో మార్పునకు ముందడుగు. మైదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్ కానున్న అనంత్ టెక్నాలజీస్.. భారత్‌కు స్టేట్ ఆఫ్ ఆర్ట్ జీఎస్‌ఓ కమ్యూనికేషన్ శాటిలైట్ సేవలను అందించనుంది. ఇస్రో, టెలికమ్యూనికేషన్ విభాగం మద్ధతుతో, మేము చేస్తున్న ఈ ప్రయత్నం.. దేశీయ శాటిలైట్ల ద్వారా శాటిలైట్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రైవేటు రంగానికి కొత్త గుర్తింపును తీసుకొస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్‌లో ఆత్మనిర్భార్ భారత్‌ను సాధించేందుకు ఇదో ముందడని'' అన్నారు. Also Read: పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఇదిలాఉండగా అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ 1992లో ఏర్పాటైంది. ఈ కంపెనీ.. శాటిలైట్లు, వైహికిల్స్, స్పేస్‌క్రాఫ్ట్ పేలోడ్స్, అలాగే గ్రౌండ్ సిస్టమ్స్‌ను లాంచ్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ అలాగే మెకానికల్ సబ్‌సిస్టమ్స్‌ను తయారుచేస్తాయి. అంతేకాదు ఈ సంస్థ ఇస్రోకు చెందిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ భాగస్వామ్యంతో శాటిలైట్లను కూడా తయారుచేస్తుంది అలాగే వీటిని లాంట్ చేసే సేవలను కూడా అందిస్తుంది. మరోవైపు IN-SPACe చేసిన ప్రకటను తాము స్వాగతిస్తున్నామని అనంత్ టెక్నాలజీస్ తెలిపింది. భారత ప్రైవేటు శాటిలైట్ ఆపరేటర్‌గా తమ కంపెనీ పేరును ప్రకటించినందుకు, తీసుకున్న చొరవకు అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొంది. Also Read: రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే! ఇది కూడా చూడండి: పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి