UP: సారూ...నేను ఇంకా బతికే ఉన్నాను...పోస్టుమార్టానికి తీసుకెళ్తుంటే..!

యూపీ మీరఠ్ జిల్లా గోట్కాకు చెందిన షగుణ్‌శర్మ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా వారు యువకుడు చనిపోయినట్లు చెప్పారు. దీంతో పోస్టుమార్టం కోసం తీసుకెళ్తుండగా నేను బతికే ఉన్నానంటూ యువకుడు అందరికీ షాక్‌ ఇచ్చాడు.

New Update
Road Accident rangareddy

UP: యూపీలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో చనిపోయాడని పోస్ట్‌మార్టమ్‌ కోసం తీసుకెళుతుండగా ఓ షాకింగ్‌ ఘటన వైద్య సిబ్బందికి ఎదురైంది. దెబ్బకు డాక్టర్లతో పాటూ పోలీసులు అవాక్కయ్యారు. మీరఠ్ జిల్లా గోట్కాకు చెందిన షగుణ్‌శర్మ అనే యువకుడు తన సోదరుడితో కలిసి బైకుపై ఖతౌలీ వైపు వెళుతున్నాడు.. ఇంతలో మరో వాహనం వీరి బైక్‌నువేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయాలపాలయ్యారు. షగుణ్‌శర్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మీరట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు.

Also Read:  తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!

నేను బతికే ఉన్నా!

డాక్టర్లు ఆస్పత్రిలో షగుణ్‌కు చికిత్స అందించిన తర్వాత.. అతడు చనిపోయినట్లు తెలిపారు. దీంతో షగుణ్‌ డెడ్‌బాడీని మార్చురీకి తరలించే ఏర్పాట్లు చేశారు. స్ట్రెచరుపై మార్చురీ దగ్గరకు తరలించేందుకు..పంచనామా చేస్తుంటే షగుణ్‌లో కదలిక కనిపించింది. అతడు 'సార్‌.. నేను బతికే ఉన్నా'అంటూ డాక్టర్‌కు చెప్పాడు. దీంతో అవాక్కైన వైద్యులు షగుణ్‌ను మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారు.

Also Read:  ఏపీ యువతకు గుడ్‌ న్యూస్.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతంతో పాటు!

ఈ వ్యవహారంపై మీరఠ్‌ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్సీ గుప్తా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ యువకుడు ఐసీయూలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షగుణ్ సోదరుడు కూడా మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం.

Also Read:  నవంబర్‌ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

ఈ ఘ‌ట‌న‌పై వైద్య కళాశాలప్రిన్సిప‌ల్ సీరియ‌స్ అవ్వ‌డంతో పాటు విచారణ‌కు ఆదేశించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మీడియాకు తెలిపారు. ఇక ఈ ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. కొన ఊపిరితో ఉన్న‌ప్ప‌టికీ ప‌ల్స్ కొట్టుకుంటుంది. అలాంటిది పేషెంట్ మాట్లాడే స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు చ‌నిపోయాడ‌ని మార్చ‌రీకి పంపడం దారుణమైన విషయమంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read:   లెబనాన్‌ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌...కూలిన భారీ భవనాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madya Pradesh: ఊళ్ళో నీటి కరువుతో భర్తను వదిలేసిన భార్య!

మధ్యప్రదేశ్ లోని దేవ్ర గ్రామంలో నీటి కరువు కారణంగా విసిగిపోయిన ఓ ఇల్లాలు భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో భర్త జితేందర్ అధికారుల దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకోగా.. వెంటనే గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. 

New Update
drought

Madya Pradesh: మనస్పర్థలు, గొడవలతో భర్తను వదిలేసిన భార్యలు చూసుంటారు. కానీ ఊళ్ళో నీటి కరువు కారణంగా భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఓ ఇల్లాలు. ''భవిష్యత్తులేని ఆ గ్రామంలో ఉంటే తన పిల్లలు ఏం బాగుపడతారని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దేవ్ర గ్రామంలో వెలుగుచూసింది. 

అయితే దేవ్ర గ్రామంలో జితేంద్ర అనే వ్యక్తి రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.  కాగా, ఈ గ్రామంలో ప్రజలు నీటి కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఊరు అంతటా కలిపి ఒకే ఒక్క బోరు బావి ఉండగా.. రోజంతా గ్రామస్థులు నీటి కోసం దాని ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఓ ట్యాంక్ నిర్మించినప్పటికీ దానికి నీటి సరఫరా ఏర్పాట్లు లేవు. 

నీటి కరువుతో భర్తను వదిలేసి.. 

ఈ పరిస్థితులతో విసిగిపోయిన జితేందర్ భార్య పిల్లలను తీసుకొని పుట్టింటింది వెళ్ళిపోయింది. దీంతో జితేందర్ జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ''భవిష్యత్తులేని గ్రామంలో నా పిల్లలు ఏం బాగుపడతారని తన భార్య నిలదీసిందని'' వాపోయాడు.  దీనిపై స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని పీహెచ్‌ఈ ఆదేశించారు. 

Advertisment
Advertisment
Advertisment