CM Siddaramaiah : ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో ఆయన తన పదవికి గుడ్‌బై చెప్పారు.

New Update
siddu

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో ఆయన తన పదవికి గుడ్‌బై చెప్పారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిని కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ ఈ లేఖను త్వరలోనే ఆమోదిస్తారని భావిస్తు్న్నట్లుగా సిద్ధరామయ్య  తెలిపారు. 

రాజీనామా సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. "నేను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. వారి సూచనలను శిరసా వహించి, నిబంధనల ప్రకారమే నా పదవికి రాజీనామా చేశాను. కొత్త ముఖ్యమంత్రి నియామకానికి వీలుగా నేను తప్పుకున్నాను" అని ఆయన ప్రకటించారు. తాము స్వచ్ఛందంగానే ఈ మార్పు చేస్తున్నామని, రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు.

సిద్ధరామయ్య ఎమోషనల్ 

ఈ సందర్భంగా సిద్ధరామయ్య కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తాను రాజకీయాల్లో కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. తనకు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం కల్పించిన కర్ణాటక ప్రజలందరికీ, పార్టీ శ్రేణులకు,  తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

సిద్ధరామయ్య రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రిగా  డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు . గత 2023 అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నడిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధిష్ఠానం చేసిన పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారమే ఇప్పుడు సిద్ధరామయ్య తప్పుకున్నారా? లేదా ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది.

Advertisment
తాజా కథనాలు