ED raids : ఎంపురాన్ చిత్ర నిర్మాతకు షాక్‌...ఈడీచేతికి చిక్కిన రూ.1.5 కోట్లు

ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీదాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది.

New Update
ED seizes ₹1.5 crore in raids

ED seizes ₹1.5 crore in raids

ED raids  : ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీదాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. L2-ఎంపురాన్ చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ కు చెందిన కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కోటిన్నర రూపాయలను స్వాధీనం చేసుకుంది. ఆయనకు చెందిన  శ్రీ గోపాలన్ చిట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ (గోకుల్ చిట్ ఫండ్ ఆర్థికఅవకతవలు జరిగాయన్న ఆరోపణలపై.. ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది.  ఈడీ అధికారులు కేరళ, తమిళనాడులోని గోపాలన్  ఆస్తుల వద్ద రెండు రోజులు తనిఖీలు నిర్వహించారు. 

Also Read: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్....4 నెలల్లో 224 మంది సరెండర్

కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీలకు గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ యాజమానిగా ఉన్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద రూ.1,000 కోట్ల విలువైన స్కాం దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏఎం గోపాలన్ సంస్థ తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానాతో సహా అనేక రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. మరోవైపు, గోకుల్ చిట్స్ లో తనిఖీలు ఇదేం మొదటిసారి కాదు. ఏప్రిల్ 2017లో ఆదాయపు పన్ను శాఖ మూడు రాష్ట్రాల్లోని గోకుల్ చిట్స్ ప్రాంగణంలో సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో భాగంగా సోదాలు చేపట్టింది. ఐదేళ్లలో రూ. 1,107 కోట్లను వెల్లడించకపోవడం ద్వారా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించకుండా ఉండవచ్చని ఆ సమయంలో అధికార వర్గాలు తెలిపాయి.

Also Read: జెలెన్‌స్కీ నగరంపై రష్యా దాడి.. 18 మంది మృతి

   అయితే L2 ఎంపురాన్  చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే గోపాలన్ పై అక్రమకేసులు పెట్టి కేంద్రం వేధిస్తోందని కేరళ అధికార పార్టీ LDFతో పాటు UDF ఆరోపిస్తున్నాయి. కేరళ సాంస్కృతిక రంగం, కళాత్మక స్వేచ్ఛతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛపై బీజేపీ దాడి చేస్తోందని దుయ్యబట్టాయి. కాగా L2 ఎంపురాన్  చిత్రంలో గుజరాత్  అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంపై వివాదాలు చెలరేగాయి. చిత్రంపై బీజేపీ, ఆరెస్సెస్  వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా చిత్రబృందం ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. రాజకీయ వివాదాలకు సంబంధించిన సన్నివేశాలు తొలగిస్తామని స్పష్టం చేసింది. ఐతే కేరళ సీఎం పినరయి విజయన్  సహా చాలామంది విపక్ష నేతలు సినిమాకు మద్దతుగా నిలిచారు.

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.

New Update
Exercise Aakraman

పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్‌లో రాఫెల్ యుద్ధ వివానాలు పాల్గొన్నాయి. పంజాబ్‌లోని అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లను మోహరించింది. ఇందులో లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడుల వంటి వాటిని నిర్వహించాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లు తెలుస్తోంది. 

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

రఫెల్ ఫైజర్ జెట్లు సరిహద్దు ప్రాంతాలకు చాలా దగ్గరగా ప్రయాణించాయని తెలుస్తోంది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ (AWACS) అమర్చిన విమానాలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచాయి. అదే సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లు కూడా సరిహద్దు దాటి ఎగురుతూ కనిపించాయి. 

( loc | indian-air-force | Exercise Aakraman | attack in Pahalgam | Pahalgam attack | pakistan | india | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment