Silpa Shetty : సిద్ధిఖీ హత్య...కన్నీటిపర్యంతమైన శిల్పాశెట్టి! ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.సినీ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా నివాళులు ఆర్పించారు. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే శిల్పా శెట్టి తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. By Bhavana 13 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు నివాళులు ఆర్పించేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. సినీ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా నివాళులు ఆర్పించారు. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే శిల్పా శెట్టి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తనకు అత్యంత సన్నిహితుడైన సిద్ధిఖీ చనిపోవడంతో సల్మాన్ ఖాన్ తన షూటింగ్ రద్దు చేసుకున్నాడు. సల్మాన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూట్ లో ఉన్నారు. హత్య విషయం తెలియడంతో వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని ఆసుపత్రికి బయల్దేరారు. ముంబైలోని బాంద్రా లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. హిందీ చిత్ర పరిశ్రమతో కూడా సంబంధాలున్న హై-ప్రొఫైల్ పొలిటీషియన్ సిద్ధిఖీని విజయ దశమి రోజున గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దుండగులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. “ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు చీఫ్ చెప్పారు. వారిలో ఒకరు యూపీకి చెందినవారు కాగా, మరొకరు హర్యానాకు చెందినవారు. మూడో దుండగుడు పరారీలోఉన్నట్లు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పినట్లు,” షిండే తెలిపారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆసుపత్రికి వెళ్లి బాబా సిద్దిఖీ కుటుంబాన్ని పరామర్శించారు. తన సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై అజిత్ పవార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Also Read : ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్! #bollywood #shilpa-shetty #baba siddique మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి