/rtv/media/media_files/2026/01/31/sharad-pawar-responds-on-ncp-merger-buzz-2026-01-31-14-39-07.jpg)
Sharad Pawar responds on NCP merger buzz
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెలలోనే ఆయన ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి కావడంతో రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పవార్ తీవ్రమైన డీహైడ్రేషన్, నీరసంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సెలైన్ ద్వారా ద్రవాలను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని రూబీ హాల్ క్లినిక్ చైర్మన్ డాక్టర్ పుర్వేజ్ గ్రాంట్ తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
శరద్ పవార్ ఛాతిలో ఇన్ఫెక్షన్
గత వారం (ఫిబ్రవరి 9న) శరద్ పవార్ ఛాతిలో ఇన్ఫెక్షన్, గొంతు సమస్యలతో ఇదే ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల చికిత్స తర్వాత ఫిబ్రవరి 14న డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్లు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించినప్పటికీ, పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ అస్వస్థతకు గురవ్వడం గమనార్హం. ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "బాబాను ఫాలో-అప్ పరీక్షలు మరియు హైడ్రేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చాము. అభిమానులు, కార్యకర్తలు కంగారు పడొద్దు" అని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే పవార్, తన 85 ఏళ్ల వయసులోనూ విశ్రాంతి లేకుండా పర్యటనలు చేయడం వల్లే ఈ శారీరక శ్రమ, నీరసం కలిగినట్లు వైద్యులు భావిస్తున్నారు.
Follow Us