/rtv/media/media_files/2026/04/15/fotojet-71-2026-04-15-16-46-59.jpg)
Bulldozer Action
Bulldozer Action : 180 మంది బాలికలను లైంగికంగా వేధించడమే కాకుండా ఆశ్లీల వీడియోలు చిత్రీకరించి వారిని ఇబ్బందులకు గురిచేసిన మహారాష్ట్రకు చెందిన తన్వీర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక వైపు అతని నేరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తన్వీర్ చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో అతని ఇంటిపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. అతడి నివాసంతో పాటు సమీపంలోని అక్రమ కట్టడాలను కూడా స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగినట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిందితుడి కుటుంబానికి గతంలోనే నోటీసులు జారీ చేశారని, కానీ వారు స్పందించకపోవడంతో చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చిన క్రమంలో కూల్చివేతలు చేపట్టడం సంచలనంగా మారింది.
అసలు కేసు ఏంటంటే?
మహారాష్ట్ర లోని పరాత్వడ నగరానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో పలువురు అమ్మాయిలను ట్రాఫ్ చేశాడు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 180 మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించాడు. వారికి మాయమాటలు చెప్పి వారిని ముంబయి, పూణేలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారితో ప్రేమ పేరుతో వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఈ వీడియోలను ఉపయోగించి ఆ బాలికలను బ్లాక్‌మెయిల్ చేయడం, వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేయడం చేసేవాడు. సహాకరించని కొందరి వీడియోలను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేశాడు. అయితే ఘటనకు సంబంధించి ఒక కుటుంబం రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండేకు ఓ వినతిపత్రం ద్వారా తెలియజేశారు. లేఖ ద్వారా నిందితుడి అకృత్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ సెల్ సాయంతో ఆన్‌లైన్‌లో షేర్ అయిన వీడియోలను తొలగించే చర్యలు చేపట్టడంతో పాటు ఇంకా ఎంతమందిని ట్రాప్ చేశాడనే కోణంలో విచారిస్తున్నారు.
Follow Us