Success Story: క్యాన్సర్‌ను జయించి UPSCలో సత్తా చాటిన సంజయ్.. సక్సెస్ స్టోరీ వింటే గూస్‌బంప్సే!

ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాకు చెందిన సంజయ్ దహరియా ఆరేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడి సివిల్ సర్వీసెస్‌లో సత్తా చాటారు. క్యాన్సర్‌తో పోరాడిన నిరాశ చెందకుండా UPSC సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో 946వ ర్యాంకు సాధించారు.

New Update
Sanjay Daharia

Sanjay Daharia

దేశంలో కఠిన పరీక్షల్లో యూపీఎస్సీ ఒకటి. ఈ పరీక్ష రాయాలంటే ఎన్నో ఏళ్ల ప్రిపరేషన్ ఉండాలి. పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి చదివినా ఉద్యోగం వస్తుందనే విషయం చెప్పలేరు. అయితే ఇలాంటి కఠినమైన పరీక్షను ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధితో పోరాడిన తర్వాత కూడా సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో సత్తా చాటాడు సంజయ్ దహరియా. ఇంతకీ ఎవరీ సంజయ్ దహరియా? ఇతని సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..

సామాన్య కుటుంబంలో జన్మించిన సంజయ్..

ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాకు చెందిన ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో సంజయ్ దహరియా జన్మించారు. ప్రాథమిక విద్య అంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. డిగ్రీ చేసిన తర్వాత 2009లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. అయితే సివిల్ సర్వీసెస్ అధికారి కావాలనే కోరికతో 2011లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సమయంలోనే విధి అతన్ని పరీక్షించింది. 2012లో అతనికి క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాదాపు ఆరేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడారు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకోవడంతో అతని కంటి చూపు కూడా పూర్తిగా దెబ్బతింది. అయినా కూడా సంజయ్ పట్టుదల కోల్పోకుండా యూపీఎస్సీకు ప్రిపేర్ అయ్యారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఇరాన్‌ ఓడిపోయింది.. ట్రంప్ సంచలన ప్రకటన

అనారోగ్యంతో పోరాడుతూనే జీవనోపాధి కోసం రాయ్‌పూర్‌లోని ఓ బ్యాంకులో, ఆ తర్వాత పోస్టాఫీసులో పనిచేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన కలను మాత్రం వదులుకోలేదు. 2022లో మొదటిసారి UPSC పరీక్షకు హాజరయ్యారు. నిరంతరంగా కృషి చేయగా.. 2025లో మూడవ ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇటీవల విడుదలైన UPSC సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో సంజయ్ 946వ ర్యాంకు సాధించారు. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి తన సత్తా చాటాడు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒత్తిడికి గురి కాకుండా నిరంతరంగా సంజయ్ చదివారు. నిరాశ చెందకుండా నిరంతరంగా కష్టపడితే తప్పకుండా ఫలితం అందుతుందని సంజయ్ తెలిపారు. అయితే తనకు ఏ కేడర్‌లో ఉద్యోగం వచ్చినా కూడా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Gulf: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ? లెక్కలు ఇవే

Advertisment
తాజా కథనాలు