/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Bihar Road Accident
National Crime: బీహార్ రాష్ట్రం పట్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాసౌర్హి- నౌబత్‌పూర్ రహదారిపై ధనిచక్‌మోర్ సమీపంలో ఆదివారం రాత్రి ఆరుగురు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఆరుగురు కూలీలతో సహా డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన కూలీలు అంతా పట్నా జిల్లాలోని డోరిపూర్, డ్రైవర్ సుశీల్‌కుమార్ హన్సదిహ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మితిమీరిన వేగంతో..
ఆరుగురు కూలీలు పనికి వెళ్లి సాయంత్రం ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టగానే రెండు వాహనాలు రోడ్డు పక్కనున్న లోతైన నీటి గుంతలో పడ్డాయి. జేసీబీ సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీని రప్పించి నీటి గుంతలో పడి ఉన్న మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం పోస్టు మార్టానికి తరలించారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈ ఆహార పదార్థాలు మళ్లీ వేడి చేస్తే చాలా ప్రమాదం