అమిత్‌షాకు కోల్‌కతా జూ.డాక్టర్‌ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ?

కోల్‌కతా జూ.డాక్టర్ హత్యాచార కేసులో ఇంతవరకూ న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ కుంటంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
rgkar

ఈ ఏడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో బాధితురాలికి ఇంతవరకూ న్యాయం జరగలేదు. తమకు సాయం చేసేవారు ఎవరూ లేరని ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మృతురాలి తండ్రి లేఖ రాశారు.  మా కుంటంబం తీవ్రంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది

కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను

'' నా కుమార్తెపై జరిగిన అమానవీయం ఘటన తర్వాత.. మా కుటంబం అంతా కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేము నిస్సాహాయులమనే భావన కలుగుతోంది. ఈ కేసును వెంటనే పూర్తి చేసేందుకు.. మా కూతురికి న్యాయం చేసేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయంపై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని '' బాధితురాలు తండ్రి లేఖలో వాపోయారు. అమిత్‌ షాకు ఆయన దీన్ని ఈ-మెయిల్ ద్వారా పంపారు. 

Also Read: బ్రిజ్ భూషణ్ బెడ్‌పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్

ఆగిపోయిన ఆందోళనలు

ఇదిలాఉండగా కోల్‌కతాలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటకే ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు డిమాండ్లు చేస్తున్నారు. అలాగే మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలని కోరుతున్నారు. ఇటీవలే కొంతమంది వైద్య విద్యార్థులు దీనిపై నిరాహక దీక్ష కూడా చేపట్టారు. చివరికి బెంగాల్ ప్రభుత్వం వారితో చర్చలు జరపగా అవి సఫలమయ్యాయి. దీంతో వారు దీక్ష విరమించారు. అలాగే రాష్ట్ర ఆందోళనలు కూడా విరమించారు. కానీ ఈ కేసులో బాధితురాలికి మాత్రం ఇంకా న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే బాధితురాలి తండ్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు