/rtv/media/media_files/2025/04/03/zWnwCz2xfRdQDWBdz4y1.jpg)
Rahul Gandhi Criticises Trump's Tariffs
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్‌పై 26 శాతం సుంకం విధించింది. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం ప్రభుత్వం ఈ టారిఫ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. '' చైనా భారత్‌కు చెందిన 4 వేల కిలోమీటర్లకు పైగా భూభాగాన్ని ఆక్రమించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చైనాకు లేఖ రాసినట్లు అక్కడి రాయబారి ద్వారా సమాచారం అందింది. ఈ భూభాగాన్ని వెనక్కి తీసుకోవాలని'' రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన!
అలాగే ట్రంప్ విధించిన టారిఫ్‌లపై కూడా స్పందించారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని పేర్కొన్నారు. కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎంపీ అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. చైనా ఈ ప్రాంతాన్ని ఎవరి హయాంలో తీసుకుందో అందరికీ తెలుసన్నారు. డొక్లాపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో చైనా అధికారులతో కలిసి ఎవరు సూప్ తాగారో తెలుసని అన్నారు. ఇలాంటి అంశాలపై రాజకీయలు చేయడం వల్ల ఫలితం ఉండదని తెలిపారు.
Also Read: సుప్రీం న్యాయమూర్తుల సంచలన నిర్ణయం.. ఆస్తుల ప్రకటన!
అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లతో పోల్చి చూస్తే తాము సగం మాత్రమే వసూలు చేస్తున్నామని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలోనే భారత్ తమ వాణిజ్య భాగస్వామి అని అంటూనే ట్రంప్ సుంకాలు విధించేశారు. భారత్ తమ ఉత్పత్తులపై సగటున 52 శాతం సుంకం విధిస్తోందని.. తాము 26 శాతం సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
trump | national-news | india | tariff tax