రతన్ టాటా అంత్యక్రియలు.. ఏ సంప్రదాయం ప్రకారం అంటే?

పార్సీ సమాజానికి చెందిన రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారమే జరగనున్నాయి. గురువారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీ విద్యుత్‌ శ్మశానవాటికలో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనల అనంతరం ఆయన భౌతికకాయాన్ని పూడ్చిపెట్టనున్నారు.

New Update
refdfer er dte t

Ratan Tata: హిందూ సంప్రదాయం ప్రకారమే టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హిందూ సంప్రదాయంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్ర 4 గంటలకు ముంబైలోని వర్లీ విద్యుత్‌ శ్మశానవాటికలో టాటా అత్యక్రియలు జరగనున్నాయి. దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనల అనంతరం ఆయన భౌతికకాయాన్ని పూడ్చిపెట్టనున్నారు. 

కరోనాతో పార్సీ సమాజంలో మార్పు.. 

ఈ మేరకు పార్సీ సమాజంలో కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా పార్సీ సమాజం అంత్యక్రియల ఆచారాలు నిషేధించబడ్డాయి. దీంతో రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం జరగనున్నాయి. అంతకుముందు సెప్టెంబర్ 2022లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. 

3 వేల సంవత్సరాల నాటి సంప్రదాయం..

నిజానికి పార్సీ మతంలో, మరణం తర్వాత, టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలువబడే సాంప్రదాయ స్మశానవాటికలో రాబందులు తినడానికి శరీరాన్ని బహిరంగ ప్రదేశంలో వదిలివేస్తారు. రాబందులు మృత దేహాలను తినడం కూడా పార్సీ సమాజ ఆచారంలో ఒక భాగం. రతన్‌టాటా పార్సీ మతస్తుడు కాబట్టి.. జొరాస్ట్రియన్‌ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఇరాన్‌లో నివసించిన పార్సీ కమ్యూనిటీకి చెందిన కొద్దిమంది మాత్రమే ప్రపంచం మొత్తంలో మిగిలిపోయారు. ప్రపంచంలో పార్సీల సంఖ్య 2 లక్షల కంటే తక్కువగా ఉంది. ప్రత్యేకమైన అంత్యక్రియల సంప్రదాయం కారణంగా పార్సీ జాతీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. డేగలు, రాబందులు అంతరించిపోవడంతో పార్సీ ప్రజలు అంత్యక్రియల్లో మార్పులు చేసుకున్నారు. పార్సీలలో అంత్యక్రియల సంప్రదాయం 3 వేల సంవత్సరాల నాటిది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు