/rtv/media/media_files/2026/03/13/rahul-gandhi-2026-03-13-17-18-39.jpg)
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధరించిన ఓ హారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లోహపు అలంకరణలతో ఉన్న ఈ మాల నాగాలాండ్ గిరిజన సంస్కృతికి చెందినది. ఈశాన్య రాష్ట్రాల్లోని నాగా కమ్యూనిటీలు ఇలాంటి ఆభరణాలను వేసుకుంటారు. వారు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, తమ గుర్తింపుకు, గౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా భావిస్తారు. అయితే దీని వెనుక ఉన్న ప్రాధాన్యత ఎంటో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.
ఆభరణాలకు చాలా లోతైన అర్థం
నాగాలాండ్ గిరిజన సంప్రదాయాల్లో ఈ ఆభరణాలకు చాలా లోతైన అర్థం ఉంటుంది. వారు ధరించే నెక్లెస్‌లు, తలపాగా వంటివి ఆ వ్యక్తి ఏ తెగకు చెందినవాడు, సమాజంలో వారి హోదా ఏమిటి అనే విషయాలను తెలియజేస్తాయి. ఈ ఆభరణాలను తరతరాలుగా కుటుంబ ఆస్తిగా కాపాడుకుంటూ వస్తారు. కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీటిని ధరిస్తారు. రాహుల్ గాంధీ ధరించిన ఈ హారం నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో నివసించే కోన్యాక్ నాగా తెగకు చెందినదిగా తెలుస్తోంది. వీరిని చరిత్రలో తలలను వేటాడేవారుగా పిలిచేవారు.
A touch of Nagaland in the Indian Parliament.
— NORTHEASTINDIA24 (@NorthEastnews24) March 13, 2026
LOP Rahul Gandhi was seen wearing a traditional Naga ornament. When asked by reporters, he said that someone from Nagaland had sent it to him ..... @RahulGandhi#RahulGandhi#NagalandCulture#Parliament#NortheastIndiapic.twitter.com/4wvIn2jMIT
నాగా సంప్రదాయ ఆభరణాల్లో కేవలం పూసలు మాత్రమే కాకుండా.. లోహపు పతకాలు, గాజు లేదా రాతి పూసలు, గవ్వలు, ఎముకలు, కట్టెలు వంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులను ఉపయోగిస్తారు. ఒక్కో తెగకు ఒక్కో విధమైన డిజైన్ ఉండటం వల్ల వారి ఆభరణాలను బట్టే వారు ఏ కమ్యూనిటీకి చెందినవారో సులభంగా గుర్తించవచ్చు. ఒకప్పుడు ఈ ఆభరణాలు సామాజిక ప్రతిష్టకు, సంపన్నతకు నిదర్శనంగా ఉండేవి.
ప్రస్తుత కాలంలో ఇలాంటి సంప్రదాయ మాలలను ప్రధానంగా పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ వేడుకల సమయంలో తమ సంప్రదాయ దుస్తులతో కలిపి ధరిస్తుంటారు. రాహుల్ గాంధీ ఈ హారాన్ని ధరించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow Us