/rtv/media/media_files/2025/02/12/v5HIKPlmWBfBiS5KsJ4f.jpg)
Rahul Gandhi summoned
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు పంపింది. దేశవ్యాప్తంగా రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. మార్చి నెలలో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. భారత సైన్యానికి సంబంధించి చేసిన ఆరోపణలపై అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అలోక్ వర్మ కాంగ్రెస్ ఎంపీకి సమన్లు జారీ చేశారు.
మార్చి 24న జరగనున్న తదుపరి విచారణలో తన పక్షాన్ని సమర్పించాలని ఆదేశించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ.. రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. 2022 డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా ముందు వివాదాస్పద ప్రకటన చేశారని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత సైనిక దళాలను అవమానించేవిగా, అప్రతిష్టపాలు చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మరో పరువు నష్టం దావా
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యపై లోక్‌సభ ప్రతిపక్ష నేతపై ఫిబ్రవరి 11న ప్రత్యేక కోర్టు మరో పరువు నష్టం కేసును విచారించింది.ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది, ఆ రోజు సాక్షిని విచారించనున్నారు. ఈ కేసులో సంబంధిత ఆధారాలను సమర్పించాలని కూడా కోర్టు ఫిర్యాదుదారుడిని ఆదేశించింది. గత ఐదు సంవత్సరాలుగా ఈ కేసు అనేక విచారణల ద్వారా ముందుకు వెళ్ళింది, కానీ రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కాలేదు,
వరంగల్ పర్యటన ఖరారు
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం రాహుల్‌గాంధీ నిన్న హనుమకొండలో పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు ఆయన చేరుకుంటారని తొలుత పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా రాహుల్‌గాంధీ తన పర్యటనను తాజాగా రద్దు చేసుకున్నట్లు సమాచారం.
Also Read : రోజూ ఆఫీస్‌కు విమానంలో.. 700 కి.మీ జర్నీ చేస్తున్న మహిళ