/rtv/media/media_files/2026/06/10/lawrence-2026-06-10-15-38-00.jpg)
Raghava Lawrence Political Entry Postponed
Raghava Lawrence : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లపై స్వయంగా స్పందించిన లారెన్స్.. తన జీవితంలో అత్యంత కీలకమైన, రాజకీయ నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపారు. తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో, లారెన్స్ తీసుకోబోయే నిర్ణయంపై అటు అభిమానుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Hi everyone,
— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026
I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.
The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr
షెడ్యూల్ ప్రకారం జూన్ 11 (గురువారం) ఉదయం 9:30 గంటలకు ఈ కీలక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, ఊహించని విధంగా కోలీవుడ్ లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినిమా రంగానికి భారతీరాజా చేసిన అపార సేవలకు గుర్తుగా, ఆయనపై ఉన్న గౌరవ సూచకంగా రాఘవ లారెన్స్ తన జీవితంలో తీసుకోబోయే ఆ ముఖ్యమైన నిర్ణయ ప్రకటనను ఒక రోజు ముందుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. "నా జీవితంలో ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు గతంలో చెప్పాను. కానీ ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా భారతీరాజా సర్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నేను నా సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధతో ఉన్నాను. ఆయనపై ఉన్న గౌరవంతో నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాను" అని ఎక్స్ (ట్విటర్) లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ మార్పు ప్రకారం, రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీ లేదా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన కీలక ప్రకటనను జూన్ 12 (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు వెల్లడించనున్నారు. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు, సినీ-రాజకీయ విశ్లేషకులు లారెన్స్ లీడర్‌గా మారబోతున్నారా లేదా అనే క్లారిటీ కోసం మరికొన్ని గంటల పాటు వేచి చూడక తప్పడం లేదు.
Follow Us