/rtv/media/media_files/2026/04/24/raghav-chadda-2026-04-24-15-58-21.jpg)
Raghav Chadda
ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆప్ నుంచి తప్పుకుని బీజేపీలో చేరుతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రాఘవ్ చద్దా మాట్లాడారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా ఆప్ వీడి బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతుల (2/3) మంది ఎంపీలు రాజ్యాంగ రూల్స్ ప్రకారం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.
15 ఏళ్ల పాటు తన రక్తం, చెమట ధారపోసి పెంచిన పార్టీ ఇప్పుడు తమ సిద్ధాంతాల నుండి పక్కకు తప్పుకుందని రాఘవ్ చద్దా విమర్శించారు. ఆప్ ప్రస్తుతం దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా తాను తప్పుడు పార్టీలో ఉన్నానంటూ వాపోయారు. అందుకే తాను ఆప్‌కు దూరమయ్యి, ప్రజలకు చేరువయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మరో నలుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఆప్ నుంచి 10 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండిట మూడొంతులు అంటే మొత్తం ఏడుగురు ఎంపీలు ఆప్‌ను వీడి బీజేపీ గూటికి చేరనున్నారు.
#WATCH | Delhi: Addressing a press conference with Sandeep Pathak and Ashok Mittal, AAP MP Raghav Chadha says, "We have decided that we, the 2/3rd members belonging to the AAP in Rajya Sabha, exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP." pic.twitter.com/K3IK4TPXml
— ANI (@ANI) April 24, 2026
ఎంపీల సభ్యత్వం రద్దు కాదు
ప్రస్తుతం రాజ్యసభలో ఆప్ నుంచి 10 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాఘవ్ చద్దా చెప్పిన ప్రకటన ప్రకారం10 మందిలో 7 మంది ఎంపీలు బీజేపీలో విలీనం కాబోతున్నారు. ఇప్పటికే రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ ఆప్‌కు రాజీనామా చేయగా.. వీళ్లతో పాటు స్వాతి మాలీవాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ సైతం ఆ పార్టీ నుంచి తప్పుకుని బీజేపీలో చేరనున్నారు. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎంపీల సభ్యత్వం రద్దు కాకుండా ఉండాలంటే, 10 మంది ఎంపీలలో కనీసం 7 మంది (2/3 వంతు) కలిసి పార్టీ మారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీళ్ల ఎంపీల సభ్యత్వం రద్దు కాదు. మరోవైపు ఈ నిర్ణయం వల్ల రాజ్యసభలో ఆప్ బలం పూర్తిగా తగ్గిపోతుంది. కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఈ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరనుండటంతో ఆప్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.
Follow Us