Picasso : రెస్టారెంట్‌లో భోజనం.. లాటరీలో పికాసో పెయింటింగ్: భలే కొట్టాడురా ఛాన్స్!

అదృష్టం అంటే ఇతనిదేనేమో! కేవలం 117 డాలర్ల (దాదాపు వంద యూరోలు) లాటరీ టికెట్‌తో ఏకంగా 10 లక్షల డాలర్ల (సుమారు 8.3 కోట్ల రూపాయల) విలువైన పాబ్లో పికాసో పెయింటింగ్‌ను గెలుచుకున్నాడు ఒక పారిస్ వాసి.

New Update
Picasso

అదృష్టం అంటే ఇతనిదేనేమో! కేవలం 117 డాలర్ల (దాదాపు వంద యూరోలు) లాటరీ టికెట్‌తో ఏకంగా 10 లక్షల డాలర్ల (సుమారు 8.3 కోట్ల రూపాయల) విలువైన పాబ్లో పికాసో పెయింటింగ్‌ను గెలుచుకున్నాడు ఒక పారిస్ వాసి.

మంగళవారం పారిస్‌లోని ‘క్రిస్టీస్’ వేలం సంస్థలో జరిగిన డ్రాలో 58 ఏళ్ల అరి హొదారా ఈ అరుదైన పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే, "ఇది నిజమేనా లేక ఏదైనా మోసమా అని ఎలా చెక్ చేసుకోవాలి?" అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. ఒక రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ చారిటీ లాటరీ గురించి తెలిసి, గత వీకెండ్‌లోనే తాను టికెట్ కొన్నట్లు హొదారా తెలిపారు. సేల్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆయనకు పికాసో చిత్రాలంటే(picasso painting) చాలా ఇష్టమట. "ముందు ఈ విషయాన్ని ఆఫీసు నుంచి వస్తున్న నా భార్యకు చెబుతాను.. ప్రస్తుతానికి ఈ పెయింటింగ్‌ను నేనే ఉంచుకుంటాను" అని ఆయన సంతోషంగా చెప్పారు.

Also Read :  BJP చరిత్రలో ఫస్ట్ టైం.. ‘సామ్రాట్ చౌదరి.. అనే నేను’

ఏమిటా పెయింటింగ్?

‘1 పికాసో ఫర్ 100 యూరోస్’ పేరుతో జరిగిన ఈ లాటరీలో గెలుచుకున్న పెయింటింగ్ పేరు ‘హెడ్ ఆఫ్ ఏ ఉమెన్’. దీనిని పికాసో 1941లో గీశారు. తన భాగస్వామి, ప్రేరణ అయిన డోరా మార్‌ను ఇందులో చిత్రించారు. అల్జీమర్స్ వ్యాధిపై పరిశోధనల కోసం నిధులు సేకరించే లక్ష్యంతో ఈ వినూత్న లాటరీని నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,20,000 టికెట్లు అమ్ముడవగా, 12 మిలియన్ యూరోల నిధులు సమకూరాయి. ఇందులో ఒక మిలియన్ యూరోలను ‘ఒపేరా గ్యాలరీ’కి చెల్లిస్తారు. నిజానికి ఈ పెయింటింగ్ అసలు ధర 1.45 మిలియన్ యూరోలు కాగా, సామాజిక సేవ కోసం ఆ గ్యాలరీ యజమాని తక్కువ ధరకే దీనిని అందించారు. మిగిలిన సొమ్మంతా అల్జీమర్స్ పరిశోధనల కోసం వాడనున్నారు.

గతంలో కూడా ఇలాంటి లాటరీలే నిర్వహించారు. 2013లో జరిగిన మొదటి డ్రాలో పెన్సిల్వేనియాకు చెందిన ఒక వ్యక్తికి పికాసో పెయింటింగ్ దక్కగా, 2020లో జరిగిన రెండో డ్రాలో ఇటలీకి చెందిన ఒక మహిళ విజేతగా నిలిచారు. అల్జీమర్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పికాసో మరణించినా, తన చిత్రాలు ఇలా సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగపడటాన్ని ఆయన కూడా మెచ్చుకునేవారని నిర్వాహకులు తెలిపారు.

Also Read :  180 బాలికలను లైంగికంగా వేధించిన యువకుడు.. 350 పైగా అశ్లీల వీడియోలు

Advertisment
తాజా కథనాలు