పార్లమెంట్‌లో ప్రియాంక సీటు నెంబర్ ఫిక్స్.. ఆయన పక్కనే!

పార్లమెంట్‌లో ప్రియాంక స్థానం ఖరారైంది. ప్రతిపక్ష నేతగా మొదటిసారి ఆమె పార్లమెంట్ లో అడుగుపెట్టనుండగా నాలుగో వరుసలో సీటింగ్ ఏర్పాటు చేశారు. ఆమెకు సీటు నంబర్ 517 కేటాయించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి 19 సీట్ల గ్యాప్ ఉంది.

author-image
By srinivas
New Update
Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ

Priyanka Gandhi: పార్లమెంట్‌లో ప్రియాంక స్థానం ఖరారైంది. ప్రతిపక్ష నేతగా మొదటిసారి ఆమె పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే ఆమె సీటు నెంబరు ఎంత అనేదానిపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ లోక్‌సభలో మొదటి సీట్లో కూర్చుంటుండగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో ప్లేసు, హోంమంత్రి అమిత్ షా నంబర్ 3 సీట్లో కూర్చుంటున్నారు. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సీట్ల మధ్య గ్యాప్ ఎంత? వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి నాలుగో వరుసలో సీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆమె ఎవరి పక్కన కూర్చోబోతున్నారనేది తాజాగా విడుదల చేసిన జాబితాలో ప్రకటించారు.   

గడ్కరీ సీటు మార్పు.. 


ఈ మేరకు ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో పాటు 18వ లోక్‌సభలో సీట్ల ఏర్పాటు కూడా ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ సీటులో ఎలాంటి మార్పు లేదు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి గతంలో సీటు నంబర్ 58 కేటాయించారు. అయితే సోమవారం విడుదల చేసిన సవరించిన జాబితా ప్రకారం.. గడ్కరీ సీటు నంబర్ 4. నవంబర్ 29 ప్రకటించిన సర్క్యులర్‌లో లోక్‌సభలో నాలుగు, ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వంటి అగ్రనేతల సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి. 

రాహుల్‌ గాంధీ 498వ స్థానంలో..

సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్‌ నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ 498వ స్థానంలో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు. వీరిలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఇప్పుడు ఆయన సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు.

ఇది కూడా చదవండి: GOOD NEWS: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

తొలిసారి ఎంపీ అయిన ప్రియాంక గాంధీకి నాలుగో వరుస సీటు కేటాయించారు. ఆమె సీటు నంబర్ 517లో కూర్చుంటారు. ఆయనతో పాటు కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాష్, అస్సాంకు చెందిన పార్టీ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ కూర్చుంటారు. 
దీంతో లోక్‌సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సీట్ల మధ్య 19 సీట్ల గ్యాప్ ఉంది.  

ఇది కూడా చదవండి: Aurobindo: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు.

New Update
P. chidambaram

P. chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment