వయనాడ్‌లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ

వయనాడ్‌లో ప్రియాక గాంధీ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో అక్కడ రాహుల్ గాంధీ 3 లక్షల అధిక్యంతో గెలిచారు. ఆయన రాజీనామాతో ఇక్కడ వచ్చిన ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు.

New Update
PKKK

వయనాడ్‌లో ప్రియాక గాంధీ దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్‌లో ప్రియాక గాంధీ దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేశారు. గత ఎన్నికల్లో అక్కడ రాహుల్ గాంధీ 3 లక్షల అధిక్యంతో గెలిచారు. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అభ్యర్థే గెలస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. ఎవరు గెలుస్తారో అన్నది మరికాసేపట్లో తేలనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

JEE Main Exam: జేఈఈ విద్యార్థులకు షాక్.. 'కీ' లో గందరగోళం

జేఈఈ మెయన్‌ సెషన్ 2 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. కీ విడుదలైన అనంతరం విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము రాసిన క్వశ్చన్‌ పేపర్‌కి.. రెస్పాన్స్‌ షీట్‌కి సంబంధమే లేదని చెబుతున్నారు. దీనిపై ఇంకా ఎన్‌టీఏ స్పందించలేదు.

New Update
Jee Main Exam

Jee Main Exam

జేఈఈ మెయన్‌ సెషన్ 2 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. దీని కీ విడుదలైన తర్వాత విద్యార్థులు, వారి తల్లింద్రులు, కోచింగ్ సెంటర్లు  తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థులు రాసిన క్వశ్చన్‌ పేపర్‌కి.. జేఈఈ మెయిన్‌ రెస్పాన్స్‌ షీట్‌కి సంబంధమే లేదని చెబుతున్నారు. ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో దీనిపై పోస్టులు పెడుతున్నారు. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 2,3,4,7,9 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే.  

Also Read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు నాణేలు.. ఇలా బుక్ చేసుకోండి!


మరోవైపు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై ఈ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంతవరకు స్పందించలేదు. ఎన్‌టీఏ విడుదల చేసిన రెస్పాన్స్‌ షీట్‌.. తాము అటెంప్ట్‌ చేసిన ప్రశ్నల సంఖ్యకు సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. అలాగే చాలావరకు తప్పుడు సమాధానాలు చూపిస్తోందని అంటున్నారు. దీంతో ఎన్‌టీఏపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఎన్‌టీఏ ఆడుకుంటుందని వారి తల్లిందడ్రులు విమర్శిస్తున్నారు. రెస్పాన్స్‌ షీట్‌కు, విద్యార్థులు రాసిన క్వశ్చన్ పేపర్‌కు తేడాలున్నాయని చెబుతున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. '' నా కూతురు 71 ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సబ్‌మిట్‌ చేసే సమయంలో  71 ప్రశ్నలు అటెంప్ట్ చేసినట్లు చూపించింది. కానీ ఇప్పుడు రెస్పాన్స్ షీట్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని చూయిస్తోంది. ఎన్‌టీఏ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. ఈమెయిల్‌లో మెసేజ్‌ చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరో యూజర్ స్పందిస్తూ.. '' నా కూతురు 50 ప్రశ్నలను అటెంప్ట్ చేసింది. కానీ రెస్పాన్స్‌ షీట్‌లో 48 అటెంప్ట్ చేసినట్లు చూపిస్తోందని'' చెప్పారు. ఎన్‌టీఏ దీనిపై స్పందించాలని.. తమకు అన్యాయం జరగకుండా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

telugu-news | rtv-news | jee-mains

 

Advertisment
Advertisment
Advertisment