/rtv/media/media_files/2026/04/18/pm-modi-2026-04-18-20-43-39.jpg)
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చాయని ఆయన ఆరోపించారు. విపక్షాల సంకుచిత, స్వార్థపూరిత రాజకీయాల కారణంగా ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ప్రధాని, బిల్లు ఆమోదం పొందకపోవడంపై దేశంలోని మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నాయని, మహిళల కలలను ధ్వంసం చేశాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
#WATCH | PM Narendra Modi says, "Personally, I had hopes that the Congress would rectify its decades-old mistake, that it would atone for its sins. But Congress lost the opportunity to script history and stand in support of women. Congress has lost its existence in most of the… pic.twitter.com/uOB9ELMJT1
— ANI (@ANI) April 18, 2026
#WATCH | In his address to the nation, Prime Minister Narendra Modi says, "... I was deeply saddened to see that when this proposal for women's welfare was defeated, dynastic parties like the Congress, DMK, TMC, and Samajwadi Party were clapping with joy. These people were… pic.twitter.com/Q9MI9iBwSk
— ANI (@ANI) April 18, 2026
యావత్ దేశం చూసింది
బిల్లు ఓడిపోయినప్పుడు కొన్ని వారసత్వ రాజకీయ పార్టీలు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నాయని ప్రధాని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళల ఆకాంక్షలు ఎలా అణచివేయబడ్డాయో ఇవాళ యావత్ దేశం చూసిందని ఆయన పేర్కొన్నారు. మహిళల కలలను ప్రతిపక్షాలు తుంచివేశాయని, వారి అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా విపక్షాలు వ్యవహరించాయని ప్రధాని తన ప్రసంగంలో దుయ్యబట్టారు. దేశ హితం కోసం, నారీ శక్తి హితం కోసం బిల్లు తెచ్చామన్న ఆయన.. మహిళా శక్తిని ఈ దేశం ఇంకా చూడాల్సి ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం నారీ శక్తిని అడ్డుకున్నారని అన్నారు.
కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ కుటుంబ పార్టీలు. వాళ్లు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఎంతో నిజాయితీతో తెచ్చిన బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లు క్రెడిట్ తీసుకోవాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేశామని మోడీ అన్నారు.
కాంగ్రెస్ పరాన్నజీవిలా తయారైంది. ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లు తెచ్చాం. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చాం. కానీ దీన్ని ఒప్పుకోవడానికి విపక్షాలు సిద్ధపడలేదు. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ ఆలోచన. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారని తెలిపారు.
Follow Us