బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా నిజజీవితంలో జరిగిన కథ ఆధారంగా ది సబర్మతి రిపోర్ట్ సినిమాను తెరకెక్కించాడు. ఈ ఏడాది నవంబర్ 15న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీక్షించనున్నారు. పార్లమెంట్ ప్రాంగణలోని బాలయోగి ఆడిటోరియంలో మరికొందరు నేతలతో కలిసి మోదీ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సినిమా చూడనున్నారు. ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్.. బోగిపై రాళ్ల వర్షం కురిపించి.. ఆపై.. 2022లో ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ నుంచి అహ్మదాబాద్‌కు సబర్మతి ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఎవరో ట్రైన్ లోపల చైన్ లాగడంతో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో కొందరు దుండగులు బోగీపై రాళ్ల వర్షం కురిపించారు. ఇంతటితో ఆగకుండా బోగీపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించారు. ఈ దారుణ ఘటనలో 59 మంది అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని తీసిన సినిమానే ది సబర్మతి రిపోర్ట్. ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా.. ది సబర్మతి రిపోర్ట్‌లో 12Th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే మోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా వీక్షించాలని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎంతో బాధాకరమైన ఈ ఘటనను దర్శకుడు చాలా చక్కగా చూపించాడన్నాడు. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ సినిమాను తప్పకుండా చూడాలని కొన్ని రోజుల కిందట ట్వీట్ చేయడంతో మోదీ స్పందించారు. కల్పిత కథనాలు కొన్ని రోజులు మాత్రమే కొనసాగుతుంటాయి. వాస్తవాలు అన్ని కూడా సామాన్యాలకు అర్థమయ్యే విధంగా వెలుగులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇది కూడా చూడండి: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్