సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్‌కు కీలక బాధ్యతలు.. సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆ పార్టీ నేత ప్రకాశ్ కారత్ మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పార్టీ సభ్యులు కొత్త సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. By B Aravind 29 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి సీపీఎం నేత ప్రకాశ్ కారత్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆయన మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఢిల్లీలో జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారం ఏచూరి ఆకస్మిక మరణంతో ప్రస్తుతం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మధురైలో సీపీఎం 24వ అఖిలభారత మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల్లో కొత్త సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. Also Read: అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు! CPM Elects Prakash Karat ఎవరినీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. పొలిట్ బ్యూరోలో ఉంటూ ప్రజాఉద్యమంలో పాల్గొన్న వారు ఈ పదవికి రేసులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీవీ రాఘవులు, కేరళకు చెందిన బేబీ లేదా విజయ రాఘవన్, బెంగాల్‌కు చెందిన నీలోత్పల్ బసు, మహారాష్ట్రకు చెందిన అశోక్ ధావళే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారు. #telugu-news #cpm #sitaram-yechury మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి