హర్యానాలో పనిచేయని సునిల్ కనుగోలు మ్యాజిక్..

హర్యానాలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు మ్యాజిక్ పనిచేయలేదు. 10 నెలలుగా ఆయన హర్యానాపై ఫోకస్ పెట్టినప్పటికీ కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. గ్యారెంటీ స్కీమ్‌లను హర్యానా ప్రజలు నమ్మలేదు. దీంతో అనూహ్యంగా బీజేపీ అధికారం దిశగా వెళ్తోంది

New Update

హర్యానాలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు మ్యాజిక్ పనిచేయలేదు. గత 10 నెలలుగా ఆయన హర్యానాపై ఫోకస్ పెట్టినప్పటికీ కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే నేతలను సమన్వయం చేసేలా పార్టీకి డైరక్షన్ ఇవ్వడంలో విఫలమయ్యారు. గ్యారెంటీ స్కీమ్‌లను హర్యానా ప్రజలు నమ్మలేదు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో సునీల్ కనుగోలు కీలకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే దీన్ని మరోసారి రిపీట్ చేయడంలో సునీల్ కనుగోల్ ఫ్లాప్ అయ్యారు. మరోవైపు దాదాపు అన్నీ సర్వేలు కూడా హర్యానాలో కాంగ్రెస్‌దే అధికారం అని చెప్పినప్పటికీ కూడా ఫలితాలు తారుమారయ్యాయి. అనుహ్యంగా బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటేసి అధికారం దిశగా వెళ్తోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు