Narendra Modi : 98 ఏళ్ల వృద్ధుడి కాళ్లు మెక్కిన మోదీ. ఇంతకు ఎవరీ మాఖన్ లాల్ సర్కార్?

పశ్చిమ బెంగాల్ లో సీఎం సువేందు అధికారి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక 98 ఏళ్ల వృద్ధుడిని ఆలింగనం చేసుకున్నారు.

New Update
modi

పశ్చిమ బెంగాల్ లో సీఎం సువేందు అధికారి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక 98 ఏళ్ల వృద్ధుడిని ఆలింగనం చేసుకుని, ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో ఎవరీయన చర్చ నడుస్తోంది. ఆ వృద్ధుడే మాఖన్ లాల్ సర్కార్ (Makhan Lal Sarkar).

మాఖన్ లాల్ సర్కార్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన అత్యంత సీనియర్ ,  నిబద్ధత కలిగిన బీజేపీ కార్యకర్త. జనసంఘ్ కాలం నుండి ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీల హవా బలంగా ఉన్న రోజుల్లో కూడా, తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు,  ఒడిదుడుకులను తట్టుకుంటూ ఆయన పార్టీ జెండాను మోశారు.

తొలి బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం

కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో వేదికపై ఉన్న ఈ వృద్ధ కార్యకర్త మాఖన్ లాల్ సర్కార్ ప్రధాని మోదీని పలకరించేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన మోదీ, ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి స్వయంగా వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆయన్ని ఎంతో ఆప్యాయంగా గట్టిగా కౌగిలించుకున్నారు. దేశ ప్రధాని ఒక సామాన్య సీనియర్ కార్యకర్తకు అంతటి గౌరవాన్ని ఇవ్వడం చూసి సభా ప్రాంగణంలో ఉన్న వేలాది మంది మద్దతుదారులు జై శ్రీరామ్ నినాదాలతో హర్షధ్వానాలు చేశారు.

బీజేపీ సిద్ధాంతాల కోసం దశాబ్దాలుగా శ్రమించిన ఒక సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా ఈ సంఘటనను రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలుకుతూ బెంగాల్‌లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన చారిత్రాత్మక తరుణంలో, పార్టీ పునాదుల కోసం కష్టపడిన పాత తరం కార్యకర్తను ఈ విధంగా గౌరవించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Advertisment
తాజా కథనాలు