PM Modi : మిడిల్ ఈస్ట్ టెన్షన్: రంగంలోకి దిగిన మోదీ..సౌదీ ప్రిన్స్‌తో ఫోన్ కాల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, దానివల్ల ప్రపంచ దేశాలపై పడే ప్రభావం గురించి ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

New Update
saudhi

మిడిల్ ఈస్ట్ లో మారుతున్న పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, దానివల్ల ప్రపంచ దేశాలపై పడే ప్రభావం గురించి ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

పశ్చిమ ఆసియాలో గొడవల వల్ల సముద్ర మార్గాల్లో ప్రయాణించే ఓడలకు ముప్పు వాటిల్లుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సరుకు రవాణా చేసే ఓడలు స్వేచ్ఛగా, సురక్షితంగా ప్రయాణించేలా చూడాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా ఆగిపోకుండా ఉండాలంటే షిప్పింగ్ లైన్లను రక్షించడం చాలా ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయంగా ఉన్న ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల పరిస్థితి విషమించింది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతం రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడం వల్ల ఓడల రాకపోకలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ కీలక చర్చలు జరిపారు.

వరుసగా ప్రపంచ దేశాల నేతలతో

యుద్ధం మొదలైనప్పటి నుండి ప్రధాని మోదీ వరుసగా ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్, ఇరాన్, ఫ్రాన్స్ వంటి దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ కమ్యూనిటీ సంక్షేమం కోసం సహకరిస్తున్నందుకు సౌదీ యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు