యువతకు కేంద్రం శుభవార్త.. నెలకు రూ.5 వేలు.. ఇలా అప్లై చేయండి! దేశ యువతకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకాన్ని పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. డిగ్రీ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు 2024 అక్టోబరు 12 నుంచి 25 దాకా ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. By srinivas 04 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి PM Internship : దేశ యువతకు కేంద్రం శుభవార్త చెప్పింది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకాన్ని పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాదిపాటు క్షేత్రస్థాయిలో పని నేర్చుకునే అవకాశం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. కాగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద.. గడిచిన మూడేళ్లలో చేసిన ఖర్చు ఆధారంగా టాప్-500 కంపెనీలను కేంద్రం గుర్తించి యువతకు ఈ పథకం కింద ఇంటర్న్‌షిప్ సౌకర్యాన్ని కల్పించనుంది. ఇక ఐదేళ్లలో 21-24 సంవత్సరాల వయసులో ఉన్న కోటి మంది యువతీయువకులకు నైపుణ్యాలను పెంపొందిచేందుకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ.800 కోట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి.. ఇక రూ.800 కోట్లతో మొదలుపెట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద 2025 మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి డిసెంబరు 2 నుంచి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో అభ్యర్థులకు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనుంది. అంతేకాదు దానికి అదనంగా వన్‌టైమ్ గ్రాంట్ కింద రూ.6000 అందించనుంది. మొత్తం కలిపి ఏడాదికి రూ.66 వేల ఆర్థికసాయం ఇవ్వనుంది. ఇంటర్న్‌లకు ప్రతి నెలా ఇచ్చే రూ.5 వేలల్లో రూ.4,500ను కేంద్రం భరించనుంది. ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో అభ్యర్థి ఖాతాలో వేయనుండగా.. మిగతా రూ.500, శిక్షణకు సంబంధించిన ఖర్చులను ఆయా కంపెనీలు కార్పొరేట్ సోష ల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి ఇవ్వనున్నాయి. ఇంటర్న్‌షిప్ లో చేరగానే వన్‌టైమ్ గ్రాంట్ రూ.6వేలను కూడా కేంద్రమే ఇవ్వనుంది. అర్హతలు: - హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యలో ఉత్తీర్ణత. ఐటీఐ సర్టిఫికెట్, పాలిటెక్నిక్ విద్యాసంస్థల నుంచి డిప్లొమా పూర్తి చేసినవారు. - బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకోచ్చు. - ప్రభుత్వ ఉద్యోగ కుటుంబీకులు, ఆదాయపన్ను చెల్లించే వారు, రూ.8 లక్షలు వార్షిక ఆదాయం మించిన వారు అనర్హులు.- సీఏ, సీఎంఏ చదివినవారితోపాటు ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, వంటి విద్యాసంస్థల్లో చదివినవారికి అవకాశం లేదు. వివరాల నమోదు: - 2024 అక్టోబరు 12 నుంచి 25 దాకా ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోచ్చు.- 26న తుదిజాబితా ప్రకటిస్తారు.- 2024 అక్టోబరు 27 నుంచి నవంబరు 7 వరకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. - ప్రతి ఇంటర్న్‌కూ పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన కింద బీమా సౌకర్యాన్ని ఏడాది మొత్తం కల్పిస్తారు. మూడు కంపెనీల ఆఫర్లు:ఆసక్తిగల యువతకు ఇప్పటికే మూడు కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అలెంబిక్, మహీంద్ర అండ్ మహీంద్ర, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 4 రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 1,077 ఆఫర్లు ఇచ్చాయి. ఇందులో ఒకటి తెలంగాణకు కేటాయించారు. Also Read : ప్రతిరోజూ షేవ్ చేయడం ప్రమాదకరమా? చేస్తే ఏమవుతుంది.? #pm-modi #pm-internship-program-2024 #youth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి