Rajnath Singh : బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ముక్కలవడం ఖాయం : రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కోల్ కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

New Update
Defense Minister Rajnath Singh

Defense Minister Rajnath Singh

Rajnath Singh : భారత్ భవిష్యత్తులో ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా కోల్‌కతాపై దాడి చేస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గత శనివారంనాడు నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆయన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను ఆయన చేయకుండా ఉండాల్సిందని, బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 'పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్‌ అలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా ఉండాల్సింది. 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలైనప్పుడు ఆ పరిణామాలను వాళ్లు చవిచూశారు. ఈసారి కనుక బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి' అని రాజ్‌నాథ్ చురకలంటించారు. భవిష్యత్తులో భారత్ తమపై ఏమైనా దాడులకు పాల్పడితే.. కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటామని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇటీవల కవ్వింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల పైనే తాజాగా రాజ్‌నాథ్‌ ఘాటుగా స్పందించారు

కాగా, ఆసిఫ్‌ వ్యాఖ్యలపై  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కోల్‌కతాపై దాడి చేస్తామని బహిరంగంగా బెదిరించినా ఖవాజా ఆసిఫ్ ప్రకటలను ఖండించే ధైర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షాకు లేకుండా పోయిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఒక ఔన్సు ధైర్యం ఉన్నా కేంద్ర బలగాలకు, బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీకి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునేందుకు స్వేచ్ఛనివ్వాలని ఆయన కోరారు. మోదీ, అమిత్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌‌కు ఆ సాహసం ఉందా? అని తీవ్రంగా ప్రశ్నించారు. మమతా బెనర్జీ సైతం కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అంతేకాదు భారత్ స్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన ఎందుకు హెచ్చరించలేకపోతున్నారు? అని దీదీ నిలదీశారు. దైర్యం లేని ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ తాజాగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 కాగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..  ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే 55 ఏళ్ల క్రితం పాక్‌ రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌ స్వతంత్రదేశంగా ఏర్పడింది. నాడు బంగ్లా విముక్తి పోరాటానికి భారత సైన్యం అండగా నిలిచిందన్నారు. ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని ఇస్లామాబాద్‌ను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. వారు బెంగాల్‌పై కన్నేస్తే.. ఈసారి పాక్‌ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి అని రాజ్ నాథ్‌ సింగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు