Tamilnadu: తిరుమంగై ఆళ్వార్ విగ్రహం ఇండియాకు వచ్చేస్తోంది...

ఎప్పుడో ఏళ్ళ క్రితం దొంగలించబడిన, కోట్ల రూపాయల విలువైన తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహం ఇప్పుడు భారత్‌కు తిరిగి రానుంది. లండన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఆష్మోలియన్ మ్యూజియంలో ఇన్నాళ్ళు ఉన్న ఈ విగ్రహం  తమిళనాడుకు రాబోతోంది. 

New Update
tn

దశాబ్ధాల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని సౌందరరాజ పెరుమాళ్ ఆలయం నుంచి చోరీకి గురైన, కోట్లాది రూపాయల విలువైన కవి తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని యూకే భారత్‌కి అప్పగించనుంది. దీని మీద ఆక్స్ ఫర్డ్ చాలారోజులుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో ఈ ఆళ్వార్ విగ్రహం భారత్ నుంచే చోరీకి గురైందని బలమైన సాక్ష్యాలు దొరికాయి. దాంతో దీనిని తమిళనాడుకు అప్పగించాలని ఆక్స్‌ఫర్డ్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తమిళనాడు ఐడల్ వింగ్ సీఐడీ ధ్రువీకరించింది.

Also Read :  హైదరాబాద్ లో అరబ్ షేక్ ల అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

నాలుగు విగ్రహాలు చోరీ...

తిరుమంగై ఆళ్వార్ విగ్రహాన్ని 1957-1967 మధ్య చోరీకి గురైంది. అప్పట్లో దేశం నుంచి తరలించిన అమూల్యమైన విగ్రహాల్లో ఇదొకటి. ఈ విగ్రహాలను దొంగిలించి విదేశాలకు అక్రమంగా రవాణా చేశారు. తిరుమంగై ఆళ్వార్‌తో పాటు కళింగ నర్త కృష్ణర్, విష్ణు, శ్రీదేవిల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం మిగతా మూడు విగ్రహాలు అమెరికాలోని మ్యాజియమ్‌లలో ఉన్నాయి. అయితే ఇవి ఏ ఆలయాల్లో నుంచి అయితే దొంగిలించబడ్డాయో అక్కడ ప్రస్తుతం వీటిలాగే ఉండే విగ్రహాలను తయరు చేసి పెట్టారు . వాటికే పూజలు చేస్తున్నారు.

Also Read: GDP: నెమ్మదించిన జీడీపీ...అయినా వేగంగా అభివృద్ధి

తమిళనాడు ఐడల్ వింగ్ సీఐడీ 2020లో చోరీకి గురైన విగ్రమాల మీద దర్యాప్తుని ప్రారంభించింది. సాక్ష్యాధారాల సేకరణ ద్వారా విగ్రహాలను గుర్తించింది. వీరి దర్యాప్తు విదేశాల్లో ఉన్న విగ్రహాలను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి దారి తీశాయి. విగ్రహాల మూలాలను వివరించే డాక్యుమెంటేషన్ ఇందుకు సహకరించాయి. ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు ఈ సాక్ష్యాలను పరిశీలించి, కుంభకోణం నుంచి దొంగిలించి అక్రమంగా విగ్రహాలను అమ్మినట్లు ధ్రువీకరించారు. తిరుమంగై ఆళ్వార్ విగ్రహం నెల రోజుల్లో తమిళనాడుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అమెరికాలో ఉన్న మిగతా మూడు విగ్రహాలను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని సీఐడీ చెప్పింది. 

Also Read: AP: పీసీసీ చీఫ్‌ షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ అటాక్ 

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!

Advertisment
Advertisment
తాజా కథనాలు