surrogacy తో సంతానం పొందినా ప్రసూతి సెలవులు.. ఏ రాష్ట్రంలో అంటే ?

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Surrogacy

సాధారణంగా బిడ్డకు జన్మినిచ్చే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. 26 వారాల వరకు వాళ్లకి ప్రసూతి సెలవులు ఉంటాయి. ఇందులో డెలివరీకి ముందు 8 వారాలు, డెలివరీ తర్వాత 18 వారాల వరకు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అంతేకాదు పురుషులకు కూడా కొన్నిరోజుల పాటు సెలవులు ఉంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రసూతి సెలవులు వేరుగా ఉంటాయి. అయితే తాజాగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉద్యోగులకు 180 రోజులు, అలాగే పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పించింది.  

Also Read: కర్ణాటకలో ఉర్దు భాష వివాదం.. మరో చిక్కులో పడ్డ సిద్ధరామయ్య సర్కార్

Surrogacy

ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే మహిళలు సరోగసితో సంతానం పొందితే వాళ్లకి 180 రోజులు మాతృత్వ సెలవులు వస్తాయి. ఒకవేళ సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. అయితే ఈ సెలవులు పొందాలంటే రిజిస్టర్డ్‌ వైద్యులు లేక ఆస్పత్రుల నుంచి సరోగసి తల్లి, అలాగే కమిషనింగ్ తల్లీతండ్రి మధ్య ఉన్న ఒప్పందాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 

మరోవిషయం ఏంటంటే చట్టబద్ధమైన వివాహం ద్వారా అయిదేళ్ల పాటు కలిసి ఉన్న దంపతులే సరోగసీ విధానానికి అర్హులు. భార్యకు 23 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఇక భర్తకు 26 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఆ దంపతులు సరోగసీ విధానం ద్వారా బిడ్డను పొందవచ్చు. సరోగసీ పద్ధతిలో సంతానం పొందుతున్నవారికి మాతృత్వ, పితృత్వ సెలవుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read: శంషాబాద్ నుంచి అయోధ్య రామ జన్మభూమికి విమాన సర్వీసులు

Also Read  :  జేబులో మొబైల్ పెట్టుకుంటే లైంగిక సమస్యలు..! ఇందులో నిజమెంత?

Also Read :  ఖాళీ కడుపుతో వేపాకులు తింటే ఇన్ని ప్రయోజనాలా?

Advertisment
Advertisment
తాజా కథనాలు