/rtv/media/media_files/2025/02/11/btp5CdIWPW0oBjiuyGUt.jpg)
aravind, mamatha
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్ కు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్‌కు ఆప్ మద్దతివ్వలేదని వెల్లడించారు. అందుకే అక్కడ గెలిచిందని వెల్లడించారు. కానీ పశ్చిమ బెంగాల్ లో మన పార్టీ తృణమూల్ చాలు అని చెప్పుకొచ్చారు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి ముందు పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. .
"ఢిల్లీలో ఆప్ కు కాంగ్రెస్ సహాయం చేయలేదు. హర్యానాలో ఆప్ కాంగ్రెస్ కు సహాయం చేయలేదు కాబట్టి, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. అందరూ కలిసి ఉండాలి. కానీ బెంగాల్ లో కాంగ్రెస్ కు ఏమీ లేదు. మనం ఒంటరిగా పోరాడుతాం. మన పార్టీ ఒక్కటే చాలు" అని బెనర్జీ అన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపక్ష ఓట్లు చీలిపోకుండా చూసుకోవాలని ఆమె శాసనసభ్యులకు సూచించారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై అందరూ దృష్టి పెట్టాలని, పార్టీలో వర్గ విభేదాలను పక్కన పెట్టాలని తెలిపారు.
బీజేపీ ఓటర్ల జాబితాలో విదేశీయుల పేర్లను చేర్చడానికి ప్రయత్నించవచ్చని పార్టీ శాసనసభ్యులను అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పునర్వ్యవస్థీకరిస్తామని ఆమె సమావేశంలో తెలిపారు. రేషన్ కుంభకోణం కేసులో మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ అరెస్టుపై కూడా బెనర్జీ స్పందించారు. అరెస్టును అన్యాయం అని వెల్లడించిన ఆమె మల్లిక్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు.
మూడుసార్లు హ్యాట్రిక్
బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకూ మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అయితే నాలుగో సారి గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో నిలిచి ఓటమిపాలైందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటేనే నాలుగో సారి బెంగాల్ లో తృణమూల్ నాలుగోసారి అధికారంలోకి రావడానికి ఈజీ అవుతుందని సూచిస్తున్నారు.
Also Read : తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!